కరోనా వైరస్ వ్యాప్తి ని అరికట్టాలని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద కొలువైన గంగానమ్మ తల్లిని వేడుకున్న కేశినేని శ్వేత.


కరోనా వైరస్ వ్యాప్తి ని అరికట్టాలని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద కొలువైన గంగానమ్మ తల్లిని వేడుకున్న కేశినేని శ్వేత. పటమట ప్రాంతంలోని 700 నిరుపేద కుటుంబాలకు చికెన్ బిర్యానీ పొట్లాలు పంపిణీ చేసి కరోనా నియంత్రణపై అవగాహన కల్పించడం జరిగింది.

ఈ సందర్భంగా కేశినేని శ్వేత మాట్లాడుతూ

గ్రామదేవతలకు జాతరలు చెయ్యడమనేది అనాదిగా వస్తున్న ఆచారం..

ఊరికి ఎలాంటి విపత్తులు రాకుండా ఊరిని, ఊరి ప్రజలను, చిన్నా, పెద్దా, పిల్లా పాపలను చల్లగా చూడమని వేడుకుంటూ ఊరికి కాపలాకాసే గంగానమ్మ అమ్మవారికి నైవేద్యాలు, జంతు బలులు ఇవ్వడం కూడా సంప్రదాయంగా వస్తుంది.

ఒకప్పుడు కలరా, ప్లేగు వంటి గత్తర్లు ఊర్లోకి రాకుండా అమ్మవారి జాతర్లు చేసేవారు.

ప్రస్తుతం కరోనా మహమ్మారితో చాలా దేశాలు ప్రాణభయంతో అల్లాడిపోతున్నాయి. ఎన్టీఆర్ సర్కిల్ ప్రాంతంలోని స్థానిక ప్రజానీకం వారి సంప్రదాయంగా వస్తున్న అమ్మవారి జాతరను లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ ఈ కరోనా మహమ్మారి నుంచి కాపాడమంటూ అమ్మవారికి జాతర నిర్వహిస్తున్నారు.

లాక్ డౌన్ కారణంగా పనులు లేక చాలామంది ప్రజలు ఆకలికి అలమటిస్తున్నారు.

ఈ సందర్భంగా అలాంటి వారి ఆకలిని తీర్చేందుకు ఆహారాన్ని అందిస్తున్నాము…

కోవిడ్ -19 సామాజిక వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతిఒక్కరు సామాజిక దూరాన్ని పాటిస్తూ అధికారులకు సహకరించాలని ఈ సందర్భంగా కోరారు

About The Author