కరోనా ముస్లిం పేషంట్లకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్…


పవిత్రమైన రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం కరోనా రోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. నెలరోజుల కఠోరమైన ఉపవాస దీక్షలు చేసే ముస్లింలకు.. వారి ఇళ్లలో తయారయ్యే వంటకాల మాదిరిగానే ఐసోలేషన్ వార్డులు, క్వారంటైన్లలో ఉండేవారికి పోషకమైన రంజాన్ ఫుడ్‌ను అందించబోతోంది. షెహరి, ఇఫ్తార్ విందుల్లో వారికి వెజ్, నాన్ వెజ్ వంటకాలతో కూడిన భోజనాన్ని వడ్డించబోతోంది…_

ఇక ఈ రంజాన్ మెనూ ఇవాళ్టి నుంచి అందుబాటులోకి రానుంది.కరోనా బారిన పడ్డ ముస్లిం పేషంట్లు తెల్లవారు జామున 3.30 గంటలకు ఉపవాస దీక్షను ఆరంభిస్తారు. ఆ సమయంలో షెహరిగా రొట్టెలు, వెజ్ కర్రీ, దాల్ అందించనుండగా.. సాయంత్రం ఉపవాస దీక్ష అనంతరం ఇఫ్తార్ విందులో ఖిచిడి, చికెన్ కర్రీ, బగారా రైస్, దాల్చా, వెజ్ బిర్యాని, చికెన్ బిర్యానీని అందిస్తారు. అంతేకాక మటన్ కర్రీ లేదా చికెన్ కర్రీని రోజు విడిచి రోజు వడ్డిస్తారు…_

_ఇక అల్ఫాహారం మెనూగా ఖర్జూరం, అరటిపండ్లు, ఇతర పండ్లను అందిస్తారు. కాగా, గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా వైరస్ ముస్లిమేతర పేషంట్లను వేరే గదిలోకి తరలించబోతున్నట్లు తెలుస్తోంది. ముస్లింలకు నమాజ్ చేసుకోవడానికి వీలుగా ఉండేలా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు…_

About The Author