ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కర్నూలులో కరోనా కేసులు…అకిలా ప్రియా


ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కర్నూలులో కరోనా కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. జిల్లా ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నారు. పాలన పట్ల ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రచారం తప్పా ప్రజల బాధలు అవసరం లేదు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందనడానికి జిల్లాలో తాజాగా జరిగిన సంఘటనలు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కరోనా వ్యాధితో మరణించిన వ్యక్తిని నంద్యాల హైవే పక్కన పూడ్చి పెట్టి, సిబ్బంది బ్లౌజులు ఇతర కిట్లను అక్కడే వదిలేసారు. దీంతో స్థానిక ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన విధంగా కరోనాతో మృతి చెందిన వారిని దహనం చేయాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా పూడ్చి పెట్టి ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించింది. అదేవిధంగా నంద్యాల లోనే ఒక గ్రామ సచివాలయంలో ఉద్యోగులు డాన్స్ చేస్తూ వీడియోలు పెట్టడం దారుణమైన చర్య. ప్రజలందరూ ఆందోళన, భయంతో ఉంటుంటే సచివాలయ సిబ్బంది డ్యాన్సులు చేయడం సిగ్గుచేటు. ఈ రెండు ఘటనలకు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన వారిని ప్రభుత్వం వెంటనే సస్పెండ్ చేయాలి. కర్నూలు జిల్లాలో వ్యాధి తగ్గించేందుకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. కర్నూలు ఎంపీ కుటుంబానికి కరోనా సోకడం చాలా బాధ కలిగిస్తుంది. వారి కుటుంబానికి సానుభూతిని వ్యక్తం చేస్తున్నాం.

About The Author