కరోనా కళ్ళలోనూ కాపురం ఉంటుందని తేలింది.


కరోనా కళ్ళలోనూ కాపురం ఉంటుందని తేలింది. దీంతో ఇప్పుడు ఈ వైరస్ వ్యాప్తిపై మరింత బయన్దోళనలు నెలకొన్నాయి. మొదట్లో నోరు, ముక్కు ద్వారానే వైరస్ వ్యాప్తిపై అభిప్రాయాన్ని ఇప్పుడు కళ్ళకూ వర్తింపజేశారు. కరోనా వైరస్ తో కోలుకున్న ఓ బాధితురాలి కళ్లలో ఐదు రోజుల తర్వాత వైరస్ ఆనవాళ్లు కనిపించడంతో వైద్యులు ఈ నిర్ధారణకు వచ్చారు. ముక్కు, నోటితో పాటు కళ్ల ద్వారా బయటి నుంచి ఈ వైరస్ మానవ శరీరంలోకి ప్రవేశిస్తుందని తెలుసు. తాజాగా కళ్లలోనూ ఈ వైరస్ వృద్ధి చెందుతుందని.. కన్నీరు, ఇతర కంటి స్రావాల ద్వారా ఈ వైరస్ ఇతరులకు వ్యాపించే ప్రమాదం ఉందని స్పష్టమైందని ఇటలీ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. కళ్లు గులాబీ రంగులోకి మారడం ముందస్తు కరోనా లక్షణం కావొచ్చని సూచిస్తున్నారు. కళ్ళ కలక అనేది గాలిద్వారా వచ్చే వైరస్ వల్ల కలిగే అంటువ్యాధి. గాలిద్వారానేకాకుండా , కళ్లకలక స్పర్శద్వారాకూడా వస్తుంది. అయితే దీనికి చిన్నపాటి వైద్యంచేసుకుంటే మూడు,నాలుగు రోజుల్లో కళ్లకలక తగ్గిపోతుంది. ఇప్పుడు కొత్తగా కళ్ళలో కూడా కరోనా కాపురం ఉంటుందని తెలిసిన తరువాత ప్రజలేకాదు , కంటి డాక్టర్లూ భయపడుతున్నారు.
చైనాలోని వుహాన్ నుంచి జనవరి 23న తిరిగొచ్చిన మహిళ ఒకరు ఐదురోజుల తర్వాత ఇటలీ ఆసుపత్రిలో చేరారు. పొడి దగ్గు, గొంతులో ఇన్ఫెక్షన్తో పాటు ఆమె కళ్లుగా ఎర్రగా ఉండడాన్ని వైద్యులు గుర్తించారు. కొద్ది రోజులకు ఆమెకు జ్వరంతో పాటు, కళ్లు మరింత ఎర్రగా మారడంతో.. వైద్యులు రోజూ ఆమె కళ్ల నుంచి స్రావాలు సేకరించి పరీక్షించారు. ఇలా 21 రోజుల పాటు ఆమె కళ్లలో కరోనా వైరస్ ఉన్నట్లు వెల్లడైంది. తర్వాత ఆమె కోలుకుని ఇంటికి వెళ్లారు. మళ్లీ ఐదు రోజులకు ఆమె కళ్లలోని స్రావాలను పరీక్షించగా.. కరోనా వైరస్ తిరిగి వచ్చినట్లు గుర్తించారు. ఇప్పుడు ఇదే వైద్యులకు సవాల్ గా మారింది…

About The Author