అత్యవసరమైతే పోలీస్ పాస్ తీసుకోండి: డీజీపీ గౌతమ్ సవాంగ్
రాష్ట్రంలో లాక్డౌన్ పటిష్టంగా అమలవుతున్న తరుణంలో ఎవరైనా అత్యవసర పనులపై ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు ఈ–పాస్ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ తెలిపారు. తగిన కారణాలు, ఆధారాలు చూపించి ఈ–పాస్‌కు దరఖాస్తు చేసుకుని అనుమతి పొందాలని స్పష్టం చేశారు.
దీనికి సంబంధించి డీజీపీ తెలిపిన వివరాలివీ.
► లాక్డౌన్ అమల్లో ఉన్న దృష్ట్యా వైద్యం, స్వచ్ఛంద సేవ, ప్రభుత్వ విధులు, అత్యవసర సేవల కోసం వెళ్లే వారు ఇబ్బందులకు గురవుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. అలాంటి వారికి పోలీస్ శాఖ ద్వారా అత్యవసర రవాణా పాస్‌లను జారీ చేస్తాం.
► జిల్లా పరిధిలో వెళ్లాల్సి వస్తే.. ఆ జిల్లా ఎస్పీకి అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలి. వేరే జిల్లాకు వెళ్లాల్సి వస్తే.. తమ జిల్లా ఎస్పీ ద్వారా ఆ వ్యక్తి వెళ్లాల్సిన జిల్లా ఎస్పీ నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది.
► వేరే రాష్ట్రానికి వెళ్లాల్సి వస్తే.. సదరు వ్యక్తికి సంబంధించిన జిల్లా ఎస్పీ ద్వారా డీఐజీ కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవాలి. వివరాలన్నీ పరిశీలించి ఆయా రాష్ట్రాలను సంప్రదించిన అనంతరం డీఐజీ కార్యాలయం అనుమతి మంజూరు చేస్తుంది.
► పాస్ అవసరమైన వారు చిరునామా, ఆధార్, ప్రయాణించే వాహనం నంబర్, ప్రయాణికుల సంఖ్య, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారనే వివరాలు సమర్పించాలి.
► పాస్ కోసం జిల్లా ఎస్పీల వాట్సాప్, ఈ–మెయిల్‌కు దరఖాస్తు చేసుకోవాలి.
► దరఖాస్తులను పరిశీలించాక వారి మొబైల్ నంబర్లకే పోలీసులు అనుమతులు పంపిస్తారు. ఈ–పాస్ తీసుకున్న వారు గుర్తింపు కార్డు తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలి.
ALL UNIT OFFICERS WHATSAPP NUMBERS & Email id’S
S.No Unit Name WHATSAPP Mobile Number e-mail ID’s
1. SRIKAKULAM 6309990933 dail100srikakulam@gmail.com
2. VIZIANAGARAM 9989207326 spofvzm@gmail.com
3. VISAKHAPATNAM RURAL 9440904229 vizagsp@gmail.com
4. VISAKHAPATNAM CITY 9493336633 cpvspc@gmail.com
5. EAST GODAVAI (KAKINADA) 9494933233 sp@eg.appolice.gov.in
6. RAJAHMUNDRY URBAN 9490760794 sp@rjyu.appolice.gov.in
7. WEST GODAVARI 8332959175 policecontrolroomeluruwg@gmail.com
8. KRISHNA (MACHILIPATNAM) 9182990135 sp@kri.appolice.gov.in
9. VIJAYAWADA CITY 7328909090 cp@vza.appolice.gov.in
10. GUNTUR RURAL 9440796184 Dail100gunturrural@gmail.com
11.GUNTUR URBAN 8688831568 guntururbansp@gmail.com
12.PRAKASHAM 9121102109 spongole@gmail.com
13. NELLORE 9440796383 nelloresp@gmail.com
14.CHITTOOR 9440900005 spchittoor@gmail.com
15. TIRUPATHI URBAN 9491074537 sptpturban@gmail.com
16.ANANTHAPURAM 9989819191 spatp1@gmail.com
17.KADAPA 9121100531 spkadapa2014@gmail.com
18.KURNOOL 7777877722 spkurnool.kur@gmail.com
అత్యవసర పనుల కోసం పాస్‌లు తీసుకోదలచినవారు తమ యొక్క వినతిపత్రాలను పైన ఇచ్చిన వాట్సప్ మొబైల్ నెంబర్లకు మరియు మెయిల్ ఐడీలకు మాత్రమే పంపగలరు. అంగీకరించిన అనుమతి పత్రాలు మీరిచ్చే మొబైల్ నెంబర్లకు/మెయిల్ కు అనుమతి పంపబడును.
మీరు ప్రయాణించేటపుడు జిల్లాల యొక్క వాట్సప్ నెంబర్ మరియు మెయిల్ ఐడీల నుంచి వచ్చిన అనుమతులు మాత్రమే అంగీకరించబడును. ఫార్వర్డ్ చేయబడిన అనుమతులు (పాసులు) అంగీకరించబడవు.
మీరు ప్రయాణించేటప్పుడు మీతోపాటు మీయొక్క *గుర్తింపు కార్డు (ఐడీ కార్డ్) తప్పనిసరిగా ఉంచుకోవాలని* డీజీపీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.