రాష్ట్రంలోని ప్రభుత్వ భవనాలు , పంచాయితీ కార్యాలయాలకు రంగులు…


రాష్ట్రంలోని ప్రభుత్వ భవనాలు , పంచాయితీ కార్యాలయాలకు ఇతర కట్టడాలకు వేసే రంగుల విషయంలో మార్గదర్శకాలు జారీ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు.

ప్రభుత్వ భవనాలకు రంగులు వేసే విషయంలో ఏర్పాటు చేసిన కమిటీ ఇచ్చిన సూచనల మేరకు మార్గదర్శకాలు విడుదల.

గ్రామ పంచాయితీ కార్యాలయాలకు మట్టి రంగుతో పాటు తెలుపు, నీలం, ఆకుపచ్చని రంగులు వేయాల్సిందిగా సూచిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ.

గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించేలా నాలుగు రంగులకు అర్ధాలు చెబుతూ ఉత్తర్వులు విడుదల చేసిన ప్రభుత్వం.

మట్టిని సూచిస్తూ టెర్రకోట రంగు, పాడి పంటలకు సూచనగా ఆకుపచ్చ, నీలి విప్లవానికి సూచనగా నీలం రంగు, పాల విప్లవానికి సూచనగా తెలుపు రంగులు వేయాల్సిందిగా సూచనలు .

ప్రభుత్వానికి సంబంధించిన కట్టడాలు, భవనాలకు జాతీయ బిల్డింగ్ కోడ్ మేరకు ఈ రంగులు వేయాల్సిందిగా సూచనలు.

ప్రభుత్వ భవనాలపై ఏ రాజకీయ పార్టీకి చెందిన చిహ్నాలు, రంగులు లేకుండా చూసుకోవాలని ఆదేశాలు జారీ.

ప్రతీ ప్రభుత్వ విభాగం, స్థానిక సంస్థలు ఇతర ప్రభుత్వ శాఖలు తమకు సంబంధించిన రంగును ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎంచుకోవాలని స్పష్టం చేసిన ప్రభుత్వం.

About The Author