కరోనా తగ్గుముఖం పట్టింది: కేసీఆర్.*


రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమలుతో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టిందని సీఎం కేసీఆర్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. మరికొద్ది రోజులు ప్రజలు లాక్‌డౌన్‌కు సహకరించాలని కోరారు. ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలు పాటిస్తే పరిస్థితి మరింత మెరుగవుతుందని అన్నారు. సోమవారం ప్రధాని నరేంద్ర మోదీతో జరిగే వీడియో కాన్ఫరెన్స్‌లో దేశపరిస్థితి కూడా తెలుస్తుందని కేసీఆర్‌ వివరించారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యలు, లాక్‌డౌన్‌ అమలు, సహాయ కార్యక్రమాలు తదితర అంశాలపై సీఎం కేసీఆర్‌ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ ఆస్పత్రిలో కరోనా బాధితులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు.రాష్ట్రంలో మరణాలు రేటు జాతీయ సగటు కన్నా తక్కువ ఉండటం ఊరటనిచ్చే అంశం. లాక్‌డౌన్‌ను మరింత కాలం ఇదే పద్ధతిలో కొనసాగిస్తూ..ప్రజలకు ఎవరికి వారు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ..తగిన జాగ్రత్తలు తీసుకుంటే వైరస్‌ వ్యాప్తి తగ్గిపోయే అవకాశం ఉంది. ప్రధాని వీడియోకాన్ఫరెన్స్‌లో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాల్లో పరిస్థితి వివరిస్తారు. దేశవ్యాప్తంగా పరిస్థితిపై ఓ అంచనా వస్తుంది. తదుపరి చర్యలు ఎలా ఉండాలనే విషయంలో కూడా రేపటి కాన్ఫరెన్స్‌లో అభిప్రాయాలు వస్తాయి. తద్వారా భవిష్యత్‌ కార్యాచరణపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని’ సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.

About The Author