ప్రేమించి, పెళ్లాడి.. కట్నం రాలేదని హత్య..!


*తల్లితో కలిసి దారుణానికి పాల్పడిన కొడుకు*

*మొదట బండతో తలపై మోది హత్య, తర్వాత నిప్పంటించి దహనం* ?

*విచారణలో వెలుగులోకి వాస్తవాలు..*

? కట్నం తేలేదంటూ ప్రేమించి వివాహమాడిన ఓ యువతిని భర్తే అతి దారుణంగా హత్య చేశాడు. ఆపై ఆనవాళ్లు లేకుండా… మంటల్లో మసి చేసిన దారుణం ఘటన నిజామాబాద్​ జిల్లా మాక్లూర్‌ మండలం రాంచంద్రపల్లి అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది.

? వివరాల్లోకి వెళ్తే…ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలానికి చెందిన రాధ..హైదరాబాద్‌లోని ఓ సంస్థలో పని చేసింది. ఆ సమయంలో నిజామాబాద్‌ జిల్లా నవీపేట్‌లోని శివతండాకు చెందిన ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. వీరి మధ్య కొంతకాలం ప్రేమ వ్యవహారం నడిచింది. అనంతరం వీరిద్దరు వివాహం చేసుకొన్నారు.

? లాక్‌డౌన్‌ వేళ శివతండాలోని యువకుడి ఇంట్లో ప్రస్తుతం ఉంటున్నారు.

? పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకొంటే కట్నం వచ్చేదని, తాను మరో వివాహం చేసుకొంటానని యువకుడు పలుమార్లు యువతిపై ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది. వీరి మధ్య పలుమార్లు వాగ్వాదం జరిగిందని సమాచారం.

? చివరకు తల్లితో కలిసి ఆ యువకుడు మాక్లూర్‌ మండలం రాంచంద్రపల్లి అటవీ ప్రాంతంలో మొదట బండతో తలపై మోది హత్య చేశారని పోలీసులు అంచనాకు వచ్చారు. ఆ తర్వాత నిప్పంటించి దహనం చేసినట్లు విచారణలో బయటపడింది.

? ఇప్పటికే యువతి తల్లిదండ్రులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. నిందితులిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

About The Author