త్వరలో 2వ విడత అర్చక దరఖాస్తుల స్వీకరణ..!


*ప్రైవేటు దేవాలయాలలో పనిచేసే అర్చకులకు కూడా రూ. 5000/-లు ఇచ్చే దరఖాస్తుల స్వీకరణ..*

*దానికి సంబంధించి కావలసిన పత్రాలు*

(1) ఆధార్ కార్డు నెంబర్

(2) బ్యాంక్ అకౌంట్ నెంబర్

(3) మీ ఫొన్ నెంబరు

(4) పని చెసే దేవాలయం పేరు

*ఇవి సరిపోతాయి*

పై సమాచారాన్ని మీ దేవాలయం ఏ ఏరియా పరిధిలోకి వస్తుందో ఆ ఏరియాలో దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ గారి వద్దకు పట్టుకుని వెళ్లి ఇచ్చినట్లయితే ఆయన మీ దరఖాస్తులు వెంటనే రిజిస్టర్ చేస్తారు.

*లేదా*

కరోనా లాక్ డౌన్ నేపధ్యంలో మీ వివరాలను మీ ప్రాంతంలోని స్థానిక ఎండోమెంట్ దేవస్థానముల ఇన్స్పెక్టర్ గారి నెంబరుకి ఫొన్ చేసి మీరు పనిచేస్తున్న ప్రయివేటు దేవాలయం, మీ అడ్రెస్ తదితర వివరాలు మరియు ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, బ్యాంక్ కోడ్ వివరాలు ఒక పేపర్ మీద రాసి ఫొటో తిసి వారి WhatsApp కి పంపవలెను.

ఈ 5,000/-₹లు కేంద్రప్రభుత్వం ద్వారా వుండే జాతీయ విపత్తు నివారణ సంస్ధ (డిజాస్టర్ మేనేజిమెంట్ NDRF ) నిధుల నుండి కరోనా సమస్యపై అర్చకులకు ఆర్ధిక సహాయం అందిస్తుంది.ఈ డబ్బు ఆంధ్ర ప్రదేశ్ దేవాదాయశాఖ వారికి ఎటువంటి సంబంధంలేదు.

*మొదటి విడతలో దరఖాస్తు చేసుకోని అర్చకులకు మాత్రమే ఇది వర్తింపు*

*శిరిపురపు శ్రీధర్ శర్మ*
AP. బ్రాహ్మణ చైతన్య వేదిక

About The Author