అక్రిడిటేషన్ కలిగి ఉండి 50 సంవత్సరాలు దాటిన జర్నలిస్టులకు ఈనెల 30న కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు:
ప్రభుత్వం తరఫున అక్రిడిటేషన్ పొంది 50 సంవత్సరాలు దాటిన మీడియా ప్రతినిధులకు వైయస్ఆర్ జిల్లా యంత్రాంగం త్రోట్ స్వాబ్ టెస్ట్ ( గొంతు నుండి నమూనా తీసే పరీక్ష) ను చేయదలిచామని జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సాధారణంగా 50 సం.లు నిండిన వారిలో కొంత మేర రోగ నిరోధక శక్తి తగ్గే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని 1 ఏప్రిల్, 2020 నాటికి 50 సంవత్సరాలు నిండి, అక్రిడిటేషన్ పొందిన మీడియా ప్రతినిధులు జిల్లాలో 164 మందిని గుర్తించడం జరిగిందన్నారు. సదరు జాబితాను మీడియా సంఘాల ప్రతినిధులకు కూడా చేరవేయడం జరిగింది. జాబితా నందు పేర్కొన్న వారిలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలనుకున్నవారు ఈనెల 30వ తేదీ( గురువారం) ఉదయం 9 గంటలకు కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్న సభా భవనమునకు రావలసినదిగా కోరుతున్నామన్నారు. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు రిజిస్ట్రేషన్ జరుగుతుందని, ఆ వెంటనే గొంతు నుండి నమూనా తీసే పరీక్షలు ప్రారంభమవు తాయన్నారు. ఈ వైరస్ నిర్ధారణ పరీక్షలకు వచ్చేవారు తమ వెంట ఆధార్ కార్డును తప్పనిసరిగా తీసుకుని రావాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
*జిల్లా కలెక్టరు,*
*కడప* .
ముఖ్య గమనిక : జాబితా నందు పేర్కొన్న వారు మాత్రమే ఈ పరీక్షలకు హాజరు కాగలరు. ఇతరులను అనుమతించబడదు. ఇందుకు సహకరించవలసినదిగా విజ్ఞప్తి.