డాక్టర్లకు, సిబ్బందికి.. సౌకర్యంగా హోటల్ గదులు
కర్నూలు, ఏప్రిల్ 28: కరోనా కట్టడికి ముందు వరుసలో ఉండి శ్రమిస్తున్న డాక్టర్లు, సిబ్బందికి సౌకర్యవంతంగా ఉండేందుకోసం కర్నూలు నగరంలో వివిధ హోటల్స్ లో వసతి కల్పించాలని జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ ఇచ్చిన ఆదేశాల మేరకు డాక్టర్లు, సిబ్బందికి సస్య ప్రైడ్, టూరిజం హరిత, ఎంఎస్ 9 హోటల్స్ లో దాదాపు 32 ఏసీ రూమ్స్ లో అన్ని సౌకార్యాలతో వసతి, భోజనం ఏర్పాట్లు చేశామని టూరిజం ఆర్ డి ఈశ్వరయ్య, జిల్లా టూరిజం అధికారి వెంకటేశ్వర్లు మంగళవారం నాడు తెలిపారు.
డాక్టర్లు, మెడికల్ సిబ్బంది ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కలెక్టర్ జి.వీరపాండియన్ ప్రత్యేక చొరవ తీసుకుని తమకు హోటల్స్ లో వసతి, భోజన సౌకర్యం, అలాగే కలెక్టరేట్ కోవిడ్ -19 కంట్రోల్ రూమ్ లో విధులు నిర్వాహిస్తున్న పీజీలు, డాక్టర్లు, అధికారులు, సిబ్బందికి మూడు పూటలా అల్పాహారం, భోజనం, టీ, స్నాక్స్ ఏర్పాటు చేయించినందుకు కలెక్టర్ వీరపాండియన్, జేసీ రవి పట్టన్ షెట్టి, డిఆర్ఓ పుల్లయ్య లకు జూనియర్ డాక్టర్స్ (జూడాలు), డాక్టర్లు, సిబ్బంది, అధికారులు, ఉద్యోగులు ధన్యవాదాలు.