దర్శకరత్న దాసరి నారాయణరావు గారి 73వ జయంతి నేడు…


పెద్ద దర్శకుడు అవ్వాలి అంటే పెద్ద హీరోలతో తీయాలి, భారీ బడ్జెట్ ఉండాలి అనుకుంటారు
చిన్న సినిమాలతో పెద్ద దర్శకుడు అవ్వొచ్చు అని నిరూపించిన వ్యక్తి స్వర్గీయ దాసరి నారాయణరావు గారు

సినిమా పోస్టర్లలో దర్శకుడిగా ఆయన పేరు మేఘాలలో వేసుకొని దర్శకుడికి గుర్తింపు, అభిమానులను సంపాదించుకున్న ఘనత ఆయనకే చెల్లింది.

అత్యధికంగా సినిమాలు దర్శకత్వం చేసి గిన్నిస్ బుక్ రికార్డులోక్కేకారు..

కుటుంబం ఉన్న నడివయసు వ్యక్తితో మేఘసందేశం లాంటి ప్రేమకథ తీయడం ఆయనకే చెల్లింది.
కుటుంబ కథా చిత్రాలు అమ్మా రాజీనామా, సూరిగాడు, భగ్న ప్రేమకథలు ప్రేమాభిషేకం, మజ్ను, స్వయంవరం లాంటి చిత్రాలే కాదు, వర్ణ వివక్షను ప్రశ్నించే బలిపీఠం, అవినీతి మీద ఎమ్మెల్యే ఏడుకొండలు, దొరల పెత్తనం మీద ఒసేయ్ రాములమ్మ లాంటి సామాజిక చిత్రాలు తీశారు.

ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశానికి కారణమైన బొబ్బిలిపులి, సర్దార్ పాపరాయుడు, మనుషులంతా ఒక్కటే చిత్రాలు దాసరి గారి దర్శకత్వంలో వచ్చినవే.

దర్శకుడిగా, నటుడిగా, రచయితగా ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలి మన దాసరి..

కులం చివర తోకలు ఎందుకు అని అగ్రకులాల మీద బహిరంగంగానే ధిక్కరించిన ఘనత ఆయనది.

కేంద్రమంత్రిగా రాజకీయ రంగంలో కూడా సేవలందించారు.

దాసరి గారి అభిమానులకు జయంతి శుభాకాంక్షలు

About The Author