జగన్ సర్కార్ సంచలనం.. ఇకపై ఇంటర్ ఉంటేనే ప్రభుత్వ ఉద్యోగం..
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ ఉద్యోగం పొందాలంటే ఇంటర్ విద్యార్హత తప్పనిసరి చేస్తూ కీలక ప్రకటన చేసింది. దశాబ్దాల నుంచి ప్రభుత్వ ఉద్యోగాలకు పదవ తరగతి అర్హతగా ఉండగా.. దీన్ని ప్రభుత్వం మార్చనుంది. త్వరలోనే దీనిపై పూర్తి వివరాలను వెల్లడించనుంది. దీనితో పాటు ఈ విద్యా సంవత్సరం ఎకాడమిక్ క్యాలెండర్‌ను కూడా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సాధారణంగా జూన్ 12 నుంచి ఏప్రిల్ 23 వరకు విద్యా సంవత్సరం ఉండేది. అయితే కరోనా కారణంగా ఈ ఏడాది ఆగష్టు నుంచి వచ్చే ఏడాది 2021 జూలై వరకు విద్యా సంవత్సరం కొనసాగించాలని నిర్ణయించింది. కాగా, రాష్ట్రంలో లాక్‌డౌన్ ఎత్తేసిన రెండు వారాల తర్వాత పదో తరగతి పరీక్షలు జరపాలని అధికారులు కసరత్తులు చేస్తున్నారు.