తిరుగు ప్రయాణంలో ఖాళీగా శ్రామిక్ రైళ్లు
లాక్ డౌన్ సడలింపులో భాగంగా వలస కార్మికులను స్పెషల్ ట్రైన్స్ లో వారి రాష్ట్రాలకు తరలిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ రైళ్లలో వెళ్లే ప్రయాణికుల కోసం సోమవారం ఓ ప్రకటన జారీ చేసింది రైల్వేశాఖ. వలస కార్మికులను వారి సొంత రాష్ట్రాలకు చేరవేస్తున్న శ్రామిక్ రైళ్లు తిరుగు ప్రయాణంలో ఖాళీగా వస్తాయని రైల్వేఖాఖ ప్రకటించింది.
తిరుగు ప్రయాణంలో ఈ రైళ్లలోకి ప్రయాణికులను అనుమతించరని .. రైళ్ల బోగీలకు తాళం వేస్తారని తెలిపింది. అలాగే వలస కార్మికులకు ఆహారం సరఫరా చేస్తున్నట్లు రైల్వేశాఖ వివరించింది. తిరుగు ప్రయాణంలో ఈ రైళ్లలో రావచ్చని కొంత మంది భావిస్తుండటంతో ఫుల్ క్లారిటీతో ఈ ప్రకటన చేసినట్లు తెలిపింది రైల్వేశాఖ. ప్రయాణికులు కన్ ఫ్యూజ్ కావద్దని సూచించింది.