భర్త ప్రాణాలు తీసిన “అర్ధాంగి”..!
భర్త ప్రాణాలు తీసిన “అర్ధాంగి”..!
ఇదేం పద్ధతి అని ప్రశ్నించినందుకు శాడిస్ట్ లాగా మారిన వైనం
ప్రియుడితో ఉన్న వీడియోలు భర్తకు వాట్సాప్ చేసిన సాధ్వి..
భర్త కట్టిన తాళి తీసేసి ప్రియుడితో మళ్లీ తాళి..!
అవమానంతో భర్త ఆత్మహత్య (సూసైడ్ వీడియో రికార్డు చేస్తూ..!)
? ప్రియుడితో కలిసి తన భర్తనే ఓ భార్య వేధింపులకు గురిచేసింది. శాడిస్టులాగా ప్రవర్తిస్తూ అతనికి నరకం చూపెట్టారు. అవమానం తట్టుకోలేక ఆ భర్త ఆత్మహత్య
చేసుకుని చనిపోయాడు.
? ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ఇటార్సీలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన కథనం ప్రకారం… రాజు (27) అనే యువకుడికి గతేడాది లక్ష్మితో వివాహం జరిగింది. అయితే నెలరోజుల క్రితం లక్ష్మి పుట్టింటికి వెళ్లింది. భర్త ఎన్నిసార్లు ఫోన్ చేసినప్పటికీ ఆమె స్పందించలేదు.
? ఇదిలా ఉండగా…ఆమె మహేష్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోందని భర్తకు తెలిసింది. దీంతో భార్య లక్ష్మిని నిలదీశాడు.
? దీంతో లక్ష్మి మరింత రెచ్చిపోయింది. ప్రియుడితో ఉన్న శృంగార వీడియోలు రాజు కి వాట్సప్ చేయడం స్టార్ట్ చేసింది. వీటితో పాటుగా భర్త కట్టిన తాళి తీసేసి, ప్రియుడితో మళ్లీ తాళి కట్టించుకొని, ఆ వీడియోను కూడా తన భర్తకు పంపింది.
? మరోపక్క మహేష్ సైతం రాజుకు ఫోన్ చేసి లక్ష్మికి విడాకులు ఇచ్చేయమని తిడుతూ..అవమానించేవాడు.
? వరుస సంఘటనలతో తీవ్ర మనోవేదనకు గురైన రాజు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
?ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజు ఆరోగ్య పరిస్థితి విషమించి చనిపోయాడు.
? మృతుడి బంధువులకు అనుమానం వచ్చి వాట్సప్ పరిశీలించగా… ప్రియుడితో ఉన్న లక్ష్మి వీడియో బయటపడింది.
? తన భార్య ప్రియుడితో కలిసి వేధింపులకు గురి చేసిందని సూసైడ్ వీడియో సైతం రికార్డు చేశాడు.
? మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.