వై యస్ ఆర్ రైతు భరోసా – పి. ఎం. కిసాన్ పథకం ప్రారంభం…
వై యస్ ఆర్ రైతు భరోసా – పి. ఎం. కిసాన్ పథకం ప్రారంభం లో పాల్గొన్న రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం, రాష్ట్ర రహదారులు, భవనాల శాఖా మంత్రి ధర్మాన క్రిష్ణ దాస్, శాసన సభ్యులు ధర్మాన ప్రసాదరావు, జిల్లా కలెక్టర్ జె నివాస్, రైతు భరోసా – రెవెన్యూ జెసి సుమిత్ కుమార్
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వై యస్ ఆర్ రైతు భరోసా – పి. ఎం. కిసాన్ పథకంను ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
అన్నం పెట్టే రైతన్నకు ఎంత చేసినా తక్కువే
50 శాతం మంది రైతులకు కేవలం అర హెక్టార్ భూమి మాత్రమే
“వై యస్ ఆర్ రైతు భరోసా – పి. ఎం. కిసాన్ పథకం” కింద రైతులకు, అర్హులైన కౌలు రైతులకు, సాగుదార్లకు ఏటా రూ. 13,500 చొప్పున, అయిదేళ్లలో రూ. 67,500 అందించడం జరుగుతోంది.
రాష్ట్రములోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కౌలు రైతులకు, దేవదాయ, అటవీ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు కూడా సహాయాన్ని రైతు భరోసాగా అందించడం జరుగుతోంది.
రైతు భరోసా సొమ్మును “వై యస్ ఆర్ రైతు భరోసా – పి. ఎం. కిసాన్ పథకం” పేరుతో మొదట విడతగా – ఖరీఫ్ పంట వేసే ముందు మే నెలలో రూ. 7,500/- రెండో విడతగా – అక్టోబరులో ఖరీఫ్ పంట కోత సమయం, రబీ అవసరాలకు రూ. 4000; మూడో విడతగా – ధాన్యం ఇంటికి చేరే సమయంల, సంక్రాంతి పండగ సందర్భముగా రూ. 2,000 పంపిణీ
2019-20 సంవత్సరములో “ వైయస్ఆర్ రైతు భరోసా – పి. ఎం. కిసాన్ పథకం” కింద రాష్ట్రములోన 46.69 లక్షల రైతు కుటుంబాలకు రూ. 6,534 కోట్లు ఆర్ధిక సహాయం
2020-21 సంవత్సరములో “వైయస్ఆర్ రైతు భరోసా – పి. ఎం. కిసాన్ పథకం” కింద మొదట విడతగా రాష్ట్రములోని 49.44 లక్షల రైతు కుటుంబాలకు రూ. 3,675 కోట్ల మొత్తాన్ని జమ చేయడం జరిగింది.
గ్రామ సచివాలయంలో జాబితాలను ప్రదర్శించడం జరిగింది
ఇంకా నమోదు చేసుకోలేని అర్హులైన రైతులు ఉంటే ఇప్పుడు కూడా సచివాలయంలో నమోదు చేసుకోవచ్చు
బ్యాంకులు జమ చేసుకోరాదు. అటువంటి సంఘటనలు జరిగితే 1902 నంబరుకు ఫోన్ చేయవచ్చు
రైతన్నకు ఇంకా మంచి చేయాలని ఆలోచన
మే 30న 10641 రైతు భరోసా కేంద్రాలను గ్రామ సచివాలయం వద్ద ఏర్పాటు
రైతు భరోసా కేంద్రం గ్రామ ఆర్ధిక స్వరూపం మార్చుతుంది
నాణ్యమైన విత్తనాలు, పరికరాల విక్రయాలు
గ్రామంలో ఏ పంట వేయాలో సూచన చేస్తారు
ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసాం
కనీస మద్దతు ధర రావాలని మార్కెటింగ్ ఏర్పాట్లు చేసాం
పొగాకు, ఉల్లి వంటి పంటలకు కూడా మద్దతు ధర రావాలని చర్యలు
గతంలో ఆత్మహత్య చేసుకున్న 434 రైతు కుటుంబాలకు రూ.5 లక్షలు చెల్లించాం
వై యస్ ఆర్ జనతా బజార్లను ఏర్పాటు చేస్తాం
2019-20 సంవత్సరములో “వైయస్ఆర్ రైతు భరోసా – పి. ఎం. కిసాన్ పథకం” కింద శ్రీకాకుళం జిల్లాలోని 3.34 లక్షల రైతు కుటుంబాలకు రూ. 450.98 కోట్లు ఆర్ధిక సహాయంగా అందిచడం జరిగింది.
2020-21 సంబంధించి, “వైయస్ఆర్ రైతు భరోసా – పి. ఎం. కిసాన్ పథకం” కింద మొదట విడతగా శ్రీకాకుళం జిల్లాలోని 3.63 లక్షల రైతు కుటుంబాలకు రూ. 272.13 కోట్ల మొత్తాన్ని జమ చేయడం జరిగింది.
రైతు భరోసా కరపత్రాలను రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం, రాష్ట్ర రహదారులు, భవనాల శాఖా మంత్రి ధర్మాన క్రిష్ణ దాస్ విడుదల చేశారు
టెక్కలి మండలం తలగాం కు చెందిన రైతు హనుమంతు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గతంలో వ్యవసాయం చేయాలంటే ప్రైవేటు వ్యక్తుల వద్దకు వెళ్లాల్సి వచ్చేది
గతంలో మద్దతు ధర లేదు. దళారీ వ్యవస్థతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు
ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు
మీరు ముఖ్యమంత్రిగా రైతు బాధలు అర్ధం చేసుకుని రైతు కోసం ఆలోచిస్తున్నారు
నవరత్నాలలో రైతు భరోసా తీసుకువచ్చారు
మేనిఫెస్టోలో చెప్పిన దానికన్నా ముందుగా ఖాతాలలో జమ చేశారు
ఎంతో రుణపడి ఉన్నాం
రైతు భరోసా కేంద్రాలు గ్రామ సచివాలయంలో ఏర్పాటు చేసి నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పనిముట్లు అందిస్తామని చెప్పారు. ఇందుకు ఋణపడి ఉంటాం
పంటలకు మద్దతు ధర ప్రకటించి దళారీ వ్యవస్థకు స్వస్తి పలకడం సంతోషం
పంటలను కల్లాల వద్దనే కొనుగోలు చేసే వ్యవస్థ ఏర్పాటు చేసి రైతులకు మేలు చేస్తున్నారు
జిల్లాలో సాగునీటి వసతుల కల్పనకు తీసుకుంటున్న చర్యలు అద్భుతం
వంశధార నుండి రెండవ పంటకు మొదటి సారిగా నీరు విడుదల చేసారు
పుష్కలంగా పంటలు పండించాం
వ్యవసాయం అంటే పండుగ చేసుకుంటున్నాం
రైతు కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి
మీది రామ రాజ్యం. ప్రకృతి కూడా కరునిస్తుంది
మంచి మనసున్న ముఖ్యమంత్రి మీరు
నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలు అందించాలి
కరోనా సమయంలో మూడు విడతలుగా ఉచిత రేషన్ తో పాటు వెయ్యి రూపాయలు అందించారు
వ్యవసాయ శాఖ జెడి కె.శ్రీధర్, డిడి కె. రాబర్ట్ పాల్, వ్యవసాయ మిషన్ డైరెక్టర్ గొండు రఘురాం, జిల్లా బాలుర క్రికెట్ సంఘం అధ్యక్షులు తమ్మినేని చిరంజీవి నాగ్, వ్యవసాయ శాఖ అధికారులు