నాటుసారా స్ధావరాలపై విస్తృతంగా పోలీసుల దాడులు…


▪️ పోలీసు & ఎక్సైజ్ పోలీసులు సమన్వయంతో ….. కార్డన్ సెర్చ్ ఆపరేషన్.

▪️ గౌరవ డిజిపి శ్రీ గౌతమ్ సవాంగ్ ఐపియస్ గారు , ఎస్ ఈ బీ కమిషనర్ పర్యవేక్షణలో జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ గారి ఆదేశాల మేరకు SEB ( స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో) అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గౌతమిసాలి ఐపియస్ గారి ఆధ్వర్యంలో జిల్లాలో అవుకు మండలంలోని గడ్డమేకుల గ్రామంలో లోకల్ పోలీస్ మరియు ఎక్సైజ్‌ పోలీసులు కలిసి కార్డన్ సెర్చ్ ఆపరేషన్‌ను సోమవారం నిర్వహించారు.

▪️ 25 నుండి 30 గృహాలు ఉండే ఒక చిన్న గ్రామం . ఇది “ఎ” రకం గ్రామం,

▪️ గడ్డమేకుల గ్రామం నుండి ఇతర ప్రదేశాలకు నాటుసారా సరఫరా చేస్తున్నారన్న సమాచారం రావడంతో దాడులు చేశారు.

▪️ ఈ దాడులలో

8000 liters of Wash (40 డ్రమ్స్)

600 liters of ID

100 kg’s jaggery లను స్వాధీనం చేసుకున్నారు.

▪️ కారకులైన వారిపై కేసులు నమోదు చేశారు.

ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే నాటుసారా జోలికి వెళ్ళి నాటుసారా కాసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కర్నూలు పోలీసులు హెచ్చరిస్తున్నారు.

జిల్లా పోలీసు కార్యాలయం నుండి జారీ చేయడమైనది.

About The Author