కొండచరియలు విరిగి పెంకుటిల్లు మీద పడటంతో 12 సంవత్సరాల బాలుడుకు త్రీవ్ర గాయాలు


విశాఖ సిటీ, గాజువాక, మే 18, ఈ నెల మే 3వ తేదీన పెనుగాలి వానలకు నగరంలో ఉన్న గాజువాక 67వ వార్డు లో కొండచరియలు విరిగి పెంకుటిల్లు మీద పడటంతో రజక కుటుంబానికి సంబంధించిన ‘దాకమర్రి జస్వంత్ ‘ అనే 12 సంవత్సరాల బాలుడుకు త్రీవ్ర గాయాలపాలయ్యాడు. తలకి బలమైన దెబ్బ తగలటం వలన చికిత్స నిమిత్తం , మెడి కవర్ హాస్పిటల్ లో చికిత్స నిమిత్తం జాయిన్ చేసారు. కాగా బాలుడి బ్రెయిన్ లో ప్రాబ్లెమ్ అవ్వటం వల్ల ఆపరేషన్ చేయటం ,ఆ ఆపరేషన్ విజయవంతం అయింది .
ఈరోజు జస్వంత్ ని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకురావటం జరిగింది .
చాకిరేవు రజక సంఘం విశాఖపట్నం అధ్యక్షుడు జాగరపు శ్రీను ఈ ఆపరేషన్ నుండి సురక్షితంగా ఇంటికి చేరుకున్న జస్వంత్ ని ఇంటికి వెళ్లి పరామర్శించటం జరిగింది . బాలుడి తల్లితండ్రులు చాకలి పని, లాండ్రీ పని చేసుకునే నిరుపేద కుటుంబం. ఈ కష్టకాలంలో ఆధారంలేని ఈ పేదకుటుంబానికి మూడు రోజుల వ్యవధిలో ఆర్ధికంగా ఆదుకుంటామని జాగరపు శ్రీను భరోసా ఇచ్చారు. దాంతో బాధిత బాలుడి కుటుంబ సభ్యులు జాగరపు శ్రీనుకు రుణపడి ఉంటామని అన్నారు.

About The Author