టి‌టి‌డి JEO బంగళాలో జరిగిన దొంగతనాలు…


తిరుపతి శ్రీ పద్మావతి గెస్టు హౌస్
వద్ద మరియు ,టి‌టి‌డి JEO బంగళాలో జరిగిన దొంగతనాలకు సంబంధించిన ముద్దాయిని* *అరెస్టుచేసి రూ. 6,45,000/- వేల రూపాయల విలువ గల 173 గ్రాముల బంగారునగలు మరియు 15,200/- నగదు స్వాధీనం.*

*తిరుపతి పోలీస్ అర్బన్ జిల్లా ప్రజా సేవకు వారి యొక్క భద్రత కోసమే ఏర్పాటు చేయడం జరిగింది.*

*తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి శ్రీ ఏ.రమేష్ రెడ్డి ఐ.పి.యస్…*

మంగళవారం ..తిరుపతి కమాండ్ కంట్రోల్ లో
ఈ నెల 16 వ తేది తిరుపతి పద్మావతి గెస్ట్ హౌస్ మరియు 23 వ తేది JEO వారి ఇంటి యందు జరిగిన చోరీ కేసులను ప్రతిస్టాత్మకంగా తీసుకొన్న తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి శ్రీ ఏ.రమేష్ రెడ్డి ఐ.పి.యస్, రెండు రోజుల్లోనే కేసును చేదించిన క్రైమ్ పోలీస్ వారు. పత్రికా సమావేశం ఏర్పాటు చేసి కేసు యొక్క వివరాలను తెలిపిన తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి .
*కేసు యొక్క వివరాలు:*
ఈ నెల 16 వ తేదీ రాత్రి తిరుపతి శ్రీ పద్మావతి గెస్టు హౌస్ నందు యెవరో దొంగలు బాత్రూమ్ వెంటిలేటర్ గుండా లోనికి ప్రవేశించి 20 వేల రూపాయల నగదును దొంగలించడం, అదేవిధంగా ఈ నెల 23 వ తేదీ రాత్రి టి‌టి‌డి JEO బంగాళా నందు యెవరో దొంగలు కిటికీ మేష్ ను కట్ చేసి లోనికి ప్రవేశించి బీరువాలో వుండిన 173 గ్రాముల బంగారు నగలను దొంగలించినారు. ఈ రెండు నేరాలకు సంబంధించి తిరుపతి SVU PS నందు కేసులు నమోదు కాబడినవి. సంచలనం కలిగించిన ఈ రెండు కేసులను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి శ్రీ ఏ.రమేశ్ రెడ్డి ఐ.పి.యస్ సదరు కేసులను తిరుపతి క్రైమ్ స్టేషన్ కు బదిలీ చేసినారు.జిల్లా యస్.పి ఆదేశాల మేరకు, క్రైమ్ అడిషనల్ యస్.పి శ్రీ వేంకటేశ్వర నాయక్, డి.యస్.పి. శ్రీ రామ్మోహన్ గారి సూచనల ననుసరించి తిరుపతి సి.‌సి.‌ఎస్ ఇన్స్పెక్టర్ D.చల్లని దొర వారి సిబ్బంది పై కేసులను దర్యాప్తు చేస్తూ ఈ దినం 26-5-2020 వ తేదీ ఉదయం 11 గంటలపుడు తిరుపతి కరకంబాడి రోడ్డులో బొంతాలమ్మ గుడి ముందుగా ముద్దాయి పొగతోట గంగాధర రావు, @ సిద్దార్థ @ కార్తీక్, వయసు 27 సం.లు, తండ్రి పేరు లేట్ వెంకట్రామన, D.No. 26-11-04, కిన్నెర థియేటర్ వెనుక, మద్దిలపాలెం, విశాఖపట్టణం సిటి అనునతనిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి JEO బంగాళా లో దొంగలించిన బంగారు నగలు తూకం 174.5 గ్రాములు గల వాటిని, శ్రీ పద్మావతి గెస్టు హౌస్ లో దొంగలించిన డబ్బులు 15,200/- రూపాయలు మొత్తం 6 లక్షల 45 వేలు వీలుగా గల సొత్తులను స్వాధీనం చేసుకున్నారు.ముద్దాయి గంగాధర రావు పాత నేరస్థుడు. ఇతనొక అనాధ. ఇతను ఊహ తెలిసినప్పటి నుంచి విజయవాడ అమ్మ ఆశ్రమంలో పెరిగి అక్కడే ఇంటర్ వరకు చదివినాడు. తర్వాత చెడు వ్యసనాలకు, దొంగతనాలకు అలవాటు పది 2011 నుంచి విశాఖపట్నం, విజయనగరం, రాజమండ్రి, తుని, విజయవాడ లలో సుమారు 30 కి పైగా దొంగతనాలు చేసినాడు. ఇతనిపై విశాఖపట్నం II PS, III PS, IV PS,, విజయనగరం, రాజమండ్రి II PS, తుని , విజయవాడ లలో కేసులు ఉన్నాయి. 2011 నుంచి 2017 మద్య సుమారు 5 సంవత్సరాల పాటు జైలు లోనే శిక్షలు అనుభవించినాడు. ఇతను చివరగా ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో శ్రీకాళహస్తి కి వచ్చి వుండి అక్కడ ఇంకా ఇద్దరితో కలిసి రివర్ వ్యూ లాడ్జి లో సెల్ ఫోన్ లు, డబ్బులు దొంగలించినాడు. ఆ కేసులో 2 నెలలు శిక్ష పడి పోయిననెల 25 వతేదీ విడుదలై తిరుపతి కి వచ్చి పై దొంగతనాలు చేసినాడు. సంచలనం కలిగించిన పై కేసులను కేవలం 2 రోజులలోనే ఛేదించి, నేరస్తుని అరెస్ట్ చేసి చోరీ సొత్తులను రికవరీ చేయడంలో ప్రముఖ పాత్ర వహించిన తిరుపతి క్రైమ్ డి.యస్.పి రామ్మోహన్, సి.ఐ లు చల్లనిదొర, మధుబాబు, మోహన్, సిబ్బంది హెచ్‌సి గోపి, PCలు గౌరి నాయుడు, రామకృష్ణ, ప్రసాద్, VNL ప్రసాద్, 1825, 2042, 2327 లను జిల్లా SP అభినందిస్తూ వారికి శాఖాపరమైన రివార్డులు ఇవ్వడం జరిగింది.అలాగే తిరుపతి పోలీస్ అర్బన్ జిల్లా ప్రజా సేవకు వారి యొక్క భద్రత కోసమే ఏర్పాటు చేయడం జరిగిందని, మరియు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను కాపాడటం కూడా పోలీస్ వారియొక్క భాద్యతని, గత కొన్ని నెలలుగా పోలీస్ యంత్రాంగం అహర్నిశలు విధులు నిర్వహిస్తున్నారని, అలాగే తిరుమలకు వచ్చు వి.ఐ.పి లు, భక్తులకు భద్రత కల్పించాదతంతో పాటు భక్తులకు యెనలేని సేవ వారి సేవ చేస్తున్నాం. ఇలాంటి సంఘటనలు పునరావాసం కాకుండా బీట్ సిస్టర్, పెట్రోలింగ్ ను పెంచడంతో పాటు అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిగణలోకి తీసుకొని ప్రణాళిక బద్దంగా ఇలాంటి సంఘటనలు పునరావాసం కాకుండా ముందుకు వెళ్తాం. అలాగే ప్రజలు దూర ప్రయాణం చేయదలిచిన వారు LHMS (Locked House Monitoring System) ఏర్పాటు చేసుకోవడం వలన ఉపయోగ కరంగా ఉంటుందని, అలాగే దుకాణ దారులు, వాణిజ్య సముదాయాలవారు సి.సి కెమరాలను ఏర్పాటు చేసుకోవాలని, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ నుండి అనుక్షణం జిల్లా మొత్తం అందుబాటులో ఉన్న కెమరాలతో పర్యవేక్షిస్తున్నారని దీని ద్వారా కొన్ని కేసులను కూడా చేదించడం జరిగిందని ప్రజలు వేసవి కాలం దృష్ట్యా మీ యొక్క అమూల్యమైన వస్తువులను, ఆభరణాలు, నగదులను తగు జాగ్రత్తతో భద్ర పరుచుకోవాలని ఈ సందర్భంగా జిల్లా యస్.పి తెలియజేసారు. ఈ సమావేశంలో క్రైమ్ అడిషనల్ యస్.పి వెంకటేసుల నాయక్, యస్.బి డి.యస్.పి గంగయ్య, క్రైమ్ డి.యస్.పి రామ్మోహన్ వారు పాల్గొన్నారు.

About The Author