70 ఏళ్లుగా తిండీ, నీళ్లు ముట్టని యోగి కన్నుమూత..
గాంధీనగర్: 70 ఏళ్లుగా అన్నపానీయాలు ముట్టుకోని యోగి ప్రహ్లాద్ జాని(90) మంగళవారం ఉదయం తుది శ్వాస విడిచారు. భక్తుల సంర్శనార్థం ఆయన మృతతదేహాన్ని రెండు రోజుల పాటు బనస్కంతలోని ఆశ్రమంలో ఉంచనున్నారు. అనంతరం గురువారం నాడు అదే ఆశ్రమంలో అంత్యక్రియలు చేపట్టనున్నారు.
♦కాగా ప్రహ్లాద్ జాని గుజరాత్‌లోని చరడా గ్రామంలో జన్మించారు. ఈ యోగిని అతని భక్తులు ప్రేమగా “చునిర్వాలా మాతాజీ” అని పిలుస్తారు. గుజరాత్‌లో ఇతని పేరు తెలియని వారు ఉండరనడంలో అతిశయోక్తి లేదు. *తిండీ, నీళ్లు లేకుండా 70 ఏళ్లు జీవించడంతో అతనిపై ఎంతోమంది శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. అందులో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ కూడా ఒకరు. ఏమీ తినకుండా ఎలా జీవిస్తున్నారో అర్థం కాక చాలా మంది సైంటిస్టులు తలలు పట్టుకున్నారు.
♦ఎన్నో రకాలుగా ప్రయత్నించినప్పటికీ అసలు కారణాన్ని మాత్రం రాబట్టలేకపోయారు. 2010లో డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజియాలజీ అండ్ అలైడ్ సైన్సెస్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ ఓ అధ్యయనం నిర్వహించాయి.
♦ అందులో భాగంగా యోగిని 15 రోజుల పాటు గదిలో ఉంచి వీడియో మానిటరింగ్ నిర్వహించారు. అనంతరం ఎమ్ఆర్ఐ, ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్, తదితర వైద్య పరీక్షలు జరిపారు. ఈ ఫలితాల్లో ఆయనకు అసాధారణ రీతిలో ఆకలి, దాహాన్ని తట్టుకునే లక్షణాలున్నాయని వెల్లడైంది. అయితే ధ్యానమే తనను బతికిస్తోందని యోగి గతంలోనే సమాధానమిచ్చారు. కాగా ఆయన ఆశ్రమాన్ని సందర్శించిన వారిలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఉండటం గమనార్హం