జూన్ 1 నుండి 30 వరకు మళ్ళీ లాక్ డౌన్ కేంద్రం ఆలోచన !?..
రాష్ట్రాలకు వారే నిర్ణయం తీసుకునే అధికారం
భారత్లో కరోనా పాజిటివ్ కేసులు విజృంభిస్తున్నాయి. గత కొన్ని రోజుల నుంచి కేసుల సంఖ్య పెరుగుతున్నది. కరోనా వైరస్ కట్టడిలో బాగంగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీని కారణంగానే వైరస్ ను కొంచెం ఐన కట్టడి చేయగలిగారు. కానీ ఇప్పుడు పూర్తిగా ఎప్పుడు తీసేస్తారు అని అందరిలోనూ ఒకటే కలవరం. అందులో భాగంగానే ఇప్పుడు నాలుగో దశ లాక్ డౌన్ లో కొన్ని సడలింపులు ఇచ్చారు. దాదాపుగా అన్నింటికీ అనుమతి ఇచ్చారు. కేసుల సంఖ్య ఇప్పటికే 1 లక్ష 40 వేలకు చేరుకుంది. జూన్, జులై నెలల్లో ఇండియాలో కరోనా పీక్ స్టేజిలోకి వెళ్తుంది. ఆటో, క్యాబులకు కూడా అనుమతి ఇచ్చారు. ఇక జీవనం మామూలుగా సాగితే వైరస్ మరింత విజృంభిస్తుంది. దీని ఎఫెక్ట్ తో మరణాల రేటు కూడా పెరిగే అవకాశం ఉంటుంది.
ఇక మహారాష్ట్రలో అయితే చెప్పనవసరం లేదు… అక్కడ ఇప్పటికే 52 వేలకు చేరుకుంది. తాజాగా హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ కుడా జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది.
అన్ని రాష్ట్రాలకు సొంతంగా నిర్ణయాలు తీసుకునే హక్కు ఉంది కాబట్టి ఆ రాష్ట్రాల తీవ్రతను బట్టి లాక్ డౌన్ మీద నిర్ణయం తీసుకుంటారు అనిపిస్తుంది. ఇందులో భాగంగా జూన్ 1 నుంచి పూర్తి స్థాయిలో లాక్ డౌన్ అమలు చేస్తే బాగుంటుంది అంటున్నారు.