తూర్పుగోదావరిలో కరోనా టెర్రర్.. ఒక వ్యక్తి నుంచి 77 మందికి ….


కంటికి కనిపించని శత్రువుతో ప్రపంచదేశాలు యుద్ధం చేస్తున్నాయి. అదే కరోనా వైరస్. ఈ మహమ్మారి ఎప్పుడు.? ఎలా? వ్యాప్తి చెందుతోందో ఎవరి ఊహకు అందటం లేదు. దీన్ని కట్టడి చేయడం ప్రస్తుతం మానవజాతికి పెద్ద సవాల్‌గా మారింది. ఇంకా దీనికి విరుగుడు కనిపెట్టలేదు. అందుకే స్వీయ నియంత్రణే శ్రీరామరక్ష అని రాష్ట్ర ప్రభుత్వాలు పదేపదే చెబుతున్నాయి.
భౌతిక దూరాన్ని పాటించండి. ఎక్కడికి వెళ్లినా మాస్క్ తప్పనిసరిగా ధరించాలని సూచిస్తున్నాయి. అయినా కొంతమంది ఈ విషయాలను పట్టించుకోకుండా ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. ఫలితంగా కరోనా పాజిటివ్ కేసులు, కాంటాక్ట్ కేసులు పెరుగుతున్నాయి. ఇక తాజాగా ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో ఒక వ్యక్తి కారణంగా ఏకంగా 77 మందికి కరోనా సోకింది.
వివరాల్లోకి వెళ్తే జిల్లాలో కోవిడ్ 19తో మృతి చెందిన ఓ వ్యక్తి ద్వారా ఇప్పటివరకు సుమారు 77 మందికి కరోనా సోకినట్లు అధికారులు గుర్తించారు. వీరిలో జి మామిడాడలో 56మంది, బిక్కవోలు 13మంది, రామచంద్రపురంలో ఏడుగురు, తునిలో ఒకరు ఉన్నారు. ఆ వ్యక్తి మే 21వ తేదీన కరోనాతో మృతిచెందగా, అప్పటినుంచి వరుసగా పాజిటివ్‌ కేసులు నమోదవుతూనే ఉన్నాయి.

About The Author