నలుగురి కోసం ప్రత్యేక విమానం…
భోపాల్: దేశీయ విమానాలు అతి పరిమితంగా తిరుగుతున్న వేళ తన కుటుంబసభ్యుల కోసం ఒక వ్యాపారి ఏకంగా మొత్తం విమానాన్నే బుక్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే భోపాల్‌కు చెందిన ఒక బడా లిక్కర్ వ్యాపారి కుమార్తె, ఆమె ఇద్దరు పిల్లలు లాక్‌డౌన్‌కు ముందు దిల్లీనుంచి భోపాల్ వచ్చి అక్కడే ఉండిపోయారు. అయితే ఇటీవలే దేశీయంగా కొన్ని పరిమిత విమాన సర్వీసులకు విమానాయానశాఖ అనుమతి ఇచ్చిన క్రమంలో ఆ వ్యాపారి ఏకంగా 180 సీట్ల ఏ320 విమానాన్ని బుక్ చేసుకున్నాడు. ఆ విమానం గత సోమవారం దిల్లీ నుంచి భోపాల్ విమానాశ్రయానికి కేవలం విమాన సిబ్బందితో మాత్రమే వచ్చి ఆ వ్యాపారవేత్త కుమార్తె, ఆమె ఇద్దరు పిల్లలుతో పాటు పనిమనిషిని ఎక్కించుకుని తిరిగి దిల్లీకి వెళ్లిపోయింది. ఎయిర్‌పోర్టు అధికారులు తెలుపుతున్న వివరాల ప్రకారం ఎయిర్‌బస్ 320 తరహా విమానాన్ని బుక్ చేసుకోవాలంటే సుమారు రూ. 20 లక్షలకు పైగా ఖర్చవుతుందని తెలిపారు.