పచ్చి బొబ్బాయికి పండిన బొబ్బాయికి పోషక విలువలు, ఆరోగ్య లక్షణాల్లో చాలా తేడా వుంది.


ఇటీవల కాలంలో బొబ్బాయి పండ్ల వినియోగం బాగా పెరిగింది. గతంలో పల్లెలకే పరిమితమైన బొబ్బాయి ఇప్పుడు పట్టణ ప్రాంతాలకు విస్తరించి ఆ త్రవాత వాణిజ్యపరమైన పంటగా కూడా మారింది. ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటి పెరటిలో బొబ్బాయి చెట్టు వుండేది. బొబ్బాయిలో వుండే పోషక విలువలు విస్తృతంగా ప్రచారంలోకి రావడంతో ఇప్పడది వాణిజ్యపరమైన పంటగా మారి విదేశాలకు కూడా ఎగుమతి చేసే పంటగా మారింది. పచ్చి బొబ్బాయికి పండిన బొబ్బాయికి పోషక విలువలు, ఆరోగ్య లక్షణాల్లో చాలా తేడా వుంది. పచ్చి బొబ్బాయి ఆకుపచ్చ రంగులో వుంటే పండిన బొబ్బాయి ఆరెంజ్ రంగులో వుంటుంది. రెండింటిలోనూ రుచిలో కూడా తేడా వుంటుంది. మనం ఎక్కువగా పండిన బొబ్బాయి తినేందుకే ఇష్టపడతాం. అయితే పండిన బొబ్బాయి కంటే పచ్చి బొబ్బాయిలోనే ముఖ్యమైన ఎంజైమ్స్, విటమిన్స్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ ఏ, విటమిన్ ఈ, విటమిన్ సీ, విటమిన్ బీ వుంటాయి. బొబ్బాయిలు జీర్ణశక్తిని పెంచి ప్రొటీన్లను అవసరమైన ఎమినో యాసిడ్స్ గా మారుస్తాయి. పచ్చి బొబ్బాయి అయితే కడుపులో వికారాన్ని తొలగించి పేగులను పరిశుభ్రం చేసి మలబద్దకాన్ని కూడా తొలగిస్తాయి. పచ్చిబొబ్బాయిలో విటమిన్ ఏ, విటమిన్ సీ, విటమిన్ ఈ ఎక్కువగా వుండడం రోగనిరోధక వ్యవస్థను పెంచేందుకు, జలుబు, దగ్గును తగ్గించేందుకు ఉపయోగపడతాయి. పచ్చి బొబ్బాయిలో మూత్రనాళ సంబంధిత ఇన్ఫెక్షన్లను కూడా తొలగిస్తాయి. పాలిచ్చే తల్లులకు పండిన బొబ్బాయి కంటే పచ్చి బొబ్బాయిలే మంచివి. పచ్చి బొబ్బాయిల వల్ల పాలు సమృద్దిగా పడతాయి. చర్మం కాంతివంతంగా వుండేందుకు పచ్చి బొబ్బాయిలు దోహదం చేస్తాయి. పండిన బొబ్బాయి కంటే పచ్చి బొబ్బాయిలో తక్కువ క్యాలరీలు వుంటాయి. అందువల్ల బరువు తగ్గాలనుకునే వారికి పచ్చి బొబ్బాయిలే ఉత్తమం.

About The Author