అంతరాష్ట్ర రాక పోకలపై షరతులు కొనసాగుతాయి – డీజీపీ గౌతమ్ సవాంగ్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంతర్రాష్ట్ర కదలిక లపై తదుపరి నిర్ణయం తీసుకొనేంత వరకు షరతులు కొనసాగుతాయి. ఇతర రాష్ట్రాల నుంచి రోడ్డు మార్గాన ఆంధ్రప్రదేశ్ రావాలనుకునే ప్రయాణీకులు ఖచ్చితంగా spandana పోర్టల్ ద్వారా ఈ పాస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రయాణీకులు ఈ విషయాన్ని గమనించగలరు.
కరోన ప్రభావం తక్కువ గా ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చే వారు home quarantine లో ఉండాల్సిన అవసరం ఉంటుంది.
కరోన ప్రభావం ఎక్కువ గా ఉన్న రాష్ట్రాల నుంచి వొచ్చే వారు 7 రోజులు institutional quarantine లో ఉండి కోవిడ్ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. Positive వొచ్చిన యెడల కోవిడ్ హాస్పిటల్ కు, negative వొచ్చిన యెడల మరో ఏడు రోజులు హోమ్ quarantine కు వెల్లవలసి ఉంటుంది.
*ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చేవరకు అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద ఆంక్షలు కొనసాగుతాయి. ప్రయాణీకులు గమనించగలరు*