పాస్‌లు ఉన్నవారికి మాత్రమే అనుమతి..


అమరావతి : తెలంగాణ నుంచి ఏపీకి వస్తున్న వారిని పోలీసులు చెక్‌పోస్టుల వద్ద అడ్డుకుంటున్నారు. దీంతో గరికపాడు చెక్‌పోస్టు వద్ద కిలోమీటర్‌ మేర వాహనాలు నిలిచిపోయాయి. పాసులు ఉన్నవారిని మాత్రమే పోలీసులు అనుమతిస్తున్నారు. పాసులు ఉన్నవారి చేతిపై హోం క్వారంటైన్‌ ముద్ర వేస్తున్నారు. రాష్ట్రంలోకి వచ్చిన అనంతరం 14 రోజులపాటు స్వీయ నిర్బంధంలో ఉండాలని సూచిస్తున్నారు.

ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రోడ్డు మార్గంలో రావాలనుకునే ప్రయాణికులు స్పందన పోర్టల్‌ ద్వారా కచ్చితంగా ఈ పాస్‌ తీసుకోవాలని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు.

అంతర్‌రాష్ట్ర వాహనాల రాకపోకలపై ఏపీ ప్రభుత్వం తదుపరి నిర్ణయం తీసుకునేంత వరకూ ఈ ఆంక్షలు కొనసాగుతాయని ఆదివారం రాత్రి విడుదల చేసిన ప్రకటనలో డీజీపీ వివరించారు.

About The Author