జీవీఎల్ నరసింహారావు, బీజేపీ ఎంపీ ప్రెస్ మీట్


70 ఏళ్లలో సాధ్యం కాదనుకున్న అనేక పనులు, నిర్ణయాలు మోదీ సర్కారు చేసింది.

ఆర్టికల్ 370 రద్దు ద్వారా జమ్ము-కాశ్మీర్ రాష్ట్రాన్ని దేశంలో పూర్తి అంతర్భాగం చేసింది.

ఉగ్రవాద, తీవ్రవాద నిర్మూలన కోసం అనేక చర్యలు చేపట్టాం. ఆర్డికల్ 370 రద్దు, ఎన్ఐఏ బలోపేతం చేయడం, యూఏపీఏ చట్ట సవరణ ద్వారా వ్యక్తులను ఉగ్రవాదులుగా గుర్తించడం వంటి అనేక చర్యలు చేపట్టాం.

ఇది నరేంద్ర మోదీ సర్కారుకు మాత్రమే సాధ్యమైంది.

పౌరసత్వ సవరణ చట్టం ద్వారా పొరుగు దేశాల్లో మతపరమైన హింసకు గురై భారతదేశానికి వచ్చినవారికి సమాన హక్కులు కల్పించాం.

ట్రిపుల్ తలాఖ్ నుంచి ముస్లిం మహిళలకు విముక్తి కల్గించే చర్యలు సాహసోపేతమైనవి.

రామజన్మభూమి వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు, మందిర నిర్మాణం వంటివి చారిత్రాత్మక నిర్ణయాలు, విజయాలుగా చెప్పుకోవచ్చు.

పేదల అభివృద్ధికి గతంలో గరీబీ హఠావో పేరుతో కాంగ్రెస్ నినాదాలు మాత్రమే ఇచ్చింది. మోదీ సర్కారు మాత్రం చేతల్లో అనేక పథకాలు ప్రవేశపెట్టి పేదరిక నిర్మూలనకు పాటుపడుతున్నారు.

పేదల అభివృద్ధి విషయంలో మోదీ సర్కారు అత్యద్భుతమైన పథకాలు తీసుకొచ్చింది.

అటల్ పెన్షన్ యోజన కింద 2.23కోట్ల మందికి లబ్ది చేకూరింది.

ముద్ర యోజన కింద 6.22 కోట్ల మందికి ప్రయోజనం.

నవ్య భారత్ నిర్మాణం కోసం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా అడుగులు వేస్తున్నాం.

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 మరణాలను చూస్తే ప్రతి లక్ష మందికి 5గురు చనిపోయారు. మన దేశంలో ప్రతి లక్ష మందికి 0.3 మాత్రమే.

ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఏపి కి కేంద్రం చేసిన సహాయం.

కోవిడ్-19 లాక్‌డౌన్‌ సందర్భంగా ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన రూ. 1.7లక్షల కోట్లతో దేశవ్యాప్తంగా పేదలకు ప్రయోజనం చేకూరింది.

ఏపీలో పీఎం కిసాన్ యోజన కింద 47 లక్షల మంది రైతులకు రూ. 939 కోట్లు జమయ్యాయి.

ఏపిలో 60 లక్షల మహిళలకు  608 కోట్ల “జన్ ధన్” ఖాతాలలో జమ. 

19 లక్షలకు పైగా భవన నిర్మాణ కార్మికులకు 197 కోట్లు రాష్ట్రానికి ఇచ్చారు.

వృద్ధాప్య పెన్షన్లకు రూ. 94 కోట్లు, 1.73లక్షల ఉద్యోగుల ఈపీఎఫ్ కేంద్రమే చెల్లించింది.

ఏపి లో 20 లక్షల భవన నిర్మాణ కార్మికులకు 197 కోట్ల విడుదల. 

2.64 కోట్ల మంది ఏపీ ప్రజలకు ఉచితంగా బియ్యం అందజేశాం.

90 లక్షల కుటుంబాలకు 18వేల మెట్రిక్ టన్నుల పప్పు దినుసులు అందజేశాం.

ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన గణాంకాలు

*ఆంధ్రప్రదేశ్ కు ఇతర నిధులు*

•  పన్ను బదలాయింపుల కింద ఏప్రిల్ నెలకు 1893 కోట్ల రూపాయలు ఏపి కి విడుదల 

•  ఏప్రిల్ మొదటి వారంలో 535 కోట్ల రూపాయలు SDRF నుంచి నిధులు విడుదల.

•  ఆర్ధిక క లోటు ఉన్న రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే సహాయం కింద ఏపి కి కేంద్రం 491 కోట్ల రూపాయలు.

• “ కోరానా” నేపధ్యంలో అదనంగా మొదటి విడతగా ఏపి కి 178 కోట్ల రూపాయలు ప్రత్యేక సహాయం. 

•   మొత్తం 9,345 కోట్ల రూపాయలను ఫిబ్రవరి వరకు ఏపి కి కేంద్ర ప్రాయోజిత పధకాల కింద లభించిన ఆర్ధిక సహాయం. 

• “ నరేగా” పధకం కింద మొత్తం అన్ని రాష్ట్రాలకు ఇచ్చిన మొత్తంలో ఏపి కి 10 శాతం నిధులు. 

•“ ఆయష్మాన్ భారత్” పధకం కింద జనవరి వరకు  ఏపి కి 107 కోట్ల రూపాయల సహాయం. 

*కరోనా సమయంలో స్వావలంబన కలిగిన  భారతదేశం*

పీపీఈ కిట్లు మన దేశంలో తయారయ్యేవి కావు. కానీ ఇప్పుడు మన అవసరాలు తీరగా, ఇతర దేశాలకు ఎగుమతి చేసే పరిస్థితిలో ఉన్నాం.

కరోనా టెస్టులకు గతంలో ఒకట్రెండు ల్యాబులు ఉంటే, ఇప్పుడు 615 ల్యాబుల్లో పరీక్షలు చేస్తున్నాం.

——-

About The Author