మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్స్…
ఎపిఎండిసి కార్యాలయంలో నూతన ఇసుక పాలసీపై భూగర్భగనుల శాఖామంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశం.
హాజరైన మంత్రులు శ్రీ కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), శ్రీ పేర్ని వెంకట్రామయ్య (నాని), శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు, మైనింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, ఎపిఎండిసి విసిఅండ్ ఎండి వెంకటరెడ్డి, జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, జాయింట్ కలెక్టర్ మాధవీలత తదితరులు.
సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు కొలుసు పార్థసారధి, సామినేని ఉదయభాను, మల్లాది విష్ణు, సింహాద్రి రమేష్, వసంత కృష్ణప్రసాద్, దూలం నాగేశ్వరరావు, డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు, కైలా అనీల్ కుమార్ తదితరులు
– ఇకపై ఇసుక బుకింగ్ మరింత సరళతరం.
– ఇసుక బుకింగ్ లో ఆన్ లైన్ మోసాలను అరికట్టేందుకు చర్యలు.
– సచివాలయ వ్యవస్థ ద్వారా ఇసుక బుకింగ్ పై ఆలోచన చేస్తున్నాం.
– ఎపిఎండిసి నుంచి సచివాలయాల ద్వారా వినియోగదారులు ఇసుకను కొనుగోలు చేయవచ్చు.
– గ్రామస్థాయిలో వినియోగారుడికి ఇసుక లభ్యత మరింత సులువు అవుతంది.
– ఈ నూతన విధానంపై సీఎం గారితో చర్చించి నిర్ణయం తీసుకుంటాం.
– నూతన ఇసుక పాలసీ ద్వారా వినియోగదారులకు మేలు జరగాలి.
– మరింత పారదర్శకంగా ఇసుక విక్రమాలు, రవాణా కు చర్యలు తీసుకుంటాం.
– బల్క్ బుకింగ్ లపై కూడా కొత్త నిబంధనలు అమలు చేస్తాం.
– ప్రతి బల్క్ బుకింగ్ ను జిల్లా స్థాయిలో రీవెరిఫై చేయిస్తాం.
– వ్యక్తిగత పనులకు బుకింగ్ చేసిన దానిలో వారానికి పదిశాతం
– ప్రభుత్వ పనులకు బుకింగ్ లో వారానికి ఇరవై శాతం డెలివరీ ఇవ్వాలి.
– ప్రతి రీచ్ కు పదికిలోమీటర్ల పరిధిలోనే స్టాక్ యార్డ్ ఏర్పాటు చేయాలి.
– ఇసుక రవాణాభారం వినియోగదారులపై అధికంగా వుండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
– రాజమండ్రి నుంచి విశాఖకు ఇసుక రవాణా చెల్లింపులను కి.మీ.కు రూ. 4.90 నుంచి రూ.3.30 కి తగ్గించాం.
– రానున్న వర్షాకాలం కోసం70 లక్షల టన్నుల ఇసుకను స్టాక్ చేయాలని సీఎంగారు ఆదేశించారు.
– ఇప్పటి వరకు 40 లక్షల టన్నుల ఇసుక స్టాక్ చేయగలిగాం.
– రానున్న ఇరవై రోజుల్లో మిగిలిన లక్ష్యాన్ని కూడా పూర్తి చేయాలి.
– కృష్ణాజిల్లాలో ఇసుక ఆపరేషన్లను మరింత ముమ్మరం చేయాలి.
– కృష్ణాజిల్లాలో ఇరవై లక్షల టన్నులను వర్షాకాలంలో నిల్వ చేయాలి.
– ప్రస్తుతం ఏడు లక్షల టన్నులు నిల్వ వుంది.
– మిగిలిన దానిని కూడా నిర్ణీత సమయంలోనే నిల్వ చేసేందుకు చర్యలు తీసుకోవాలి.
– ప్రభుత్వం జిల్లాల్లో జెసిలకు ఇసుక పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించింది.
– జేసిలు ప్రతిరోజూ ఇసుక ఆపరేషన్ పై అధికారులతో టెలీకాన్ఫెరెన్స్ లు నిర్వహించాలి.
*ఇసుక రవాణాదారులతో మంత్రి సమీక్షా సమావేశం.*
– ఇసుక రవాణాదారులకు సకాలంలో బిల్లులు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
– జిపిఆర్ఎస్ లేకుండా ఎట్టిపరిస్థితుల్లోనూ వాహనాలు తిప్పకూడదు.
– రాత్రి సమయాల్లో ఇసుక ఆపరేషన్ల తగ్గించాలి.
– పట్టాభూముల్లో ఇసుక తవ్వకాల కోసం పెండింగ్ లో వున్న దరఖాస్తులను పరిశీలించి అనుమతి ఇవ్వాలి.
– ఓపెన్ రీచ్ ల నుంచి ఇసుక మైనింగ్ ను పెంచాలి.
– పట్టాభూముల్లో మిషన్ మైనింగ్ కు వున్న అవకాశంను సద్వినియోగం చేసుకోవాలి.
– పర్యావరణ నిబంధనల ప్రకారమే మైనింగ్ జరగాలి.
– ఓపెన్ రీచ్ లలో కేవలం మ్యాన్ పవర్ ద్వారానే ఇసుక తవ్వకాలు.
– ఇసుక రవాణా సందర్భంగా టార్బాలిన్ కు ప్లాస్టిక్ సీళ్ళను ఉపయోగించాలి.
– ఇసుక బుక్ చేసుకున్న చోటికి మాత్రమే డెలివరీ అవ్వాలి.
– ఒకవైపు జిపిఎస్, మరోవైపు టార్బలిన్ సీళ్ళ ద్వారా అక్రమ రవాణాను నిరోదిస్తాం.