హెయిర్ కటింగ్ చేసుకోవాలా… అయితే ఆధార్ తప్పనిసరి..


కరోనా అంతా కొత్తగా మార్చేస్తోంది. ప్రపంచం మొత్తం తిరిగి తిరిగి అక్కడికే చేరుకుంటోంది. డబ్బుల కన్నా… ఆరోగ్యమే ముఖ్యమంటోంది. కరోనా నుంచి తప్పించుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ప్రతి 15 నిమిషాలకోసారి చేతులు శుభ్రం చేసుకోమంటోంది. వ్యక్తికి.. వ్యక్తికి మధ్య దూరం పాటించమంటోంది. ఇలాంటి కొత్త నియమ నిబంధనల శ్రీకారం చుట్టింది. హెయిర్ కటింగ్ సెంటర్లలో జుట్టు కత్తిరించుకోవాలన్నా ఈ రూల్స్ పాటించాల్సిందే.
హెయిర్ కటింగ్ సెలూన్లకు మీ ఆధార్ కార్డు, మొబైల్ ఫోన్ నంబరు తప్పనిసరి వెంట తీసుకురావాలని తమిళనాడు సర్కారు నిర్ణయించింది. ఈ మేర హెయిర్ కటింగ్ సెలూన్లు, బ్యూటీపార్లర్లు, స్పాలకు మార్గదర్శకాలను జారీ చేసింది. కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో హెయిర్ కటింగ్ సెలూన్లు, బ్యూటీపార్లర్లు, స్పాలకు వచ్చే ఖాతాదారుల పేర్లు, వారి చిరునామాలు, ఫోన్ నంబర్లు, ఆధార్ నంబర్లను తీసుకోవాలని ఆదేశించింది. గ్రేటర్ చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ తోపాటు అన్ని జిల్లాల కలెక్టర్లు, కమిషనర్లకు సూచనలతో కూడిన ఆదేశాలను ప్రభుత్వం విడుదల చేసింది. హెయిర్ కటింగ్ సెలూన్లు, బ్యూటీపార్లర్ల ప్రవేశద్వారాల్లో హ్యాండ్ శానిటైజరు, సబ్బు, నీళ్లు అందుబాటులో ఉంచాలని సూచించింది. జట్టుకత్తిరించుకునేవారు ముందుగానే అప్పాయింట్‌మెంట్ తీసుకొని సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ హెయిర్ కటింగులు చేయించుకోవాలని తెలిపింది. వాడిన బ్లేడ్లను తిరిగి ఉపయోగించరాదని, హెడ్ బాండ్స్, టవల్స్ ఒకరికి మాత్రమే వాడాలని ఆర్డర్ జారీ చేసింది. హెయిర్ కటింగ్ చేసేవారు చేతులకు హ్యాండ్ గ్లోజులు , ఫేస్ మాస్క్ లు తప్పని సరి చేసింది.

About The Author