సోషల్ మీడియాలో మెసేజ్ లు తొలిగించినా చర్యలు తప్పవు-డీజీపీ హెచ్చరిక


➡️వ్యక్తి గత దూషణ చేసినా క్రిమినల్ పేర్లు పెట్టి సంబోదించినా శిక్షార్హులే

➡️వార్తలు నిజమో కాదో 9071666667 ఈ నెంబర్ కు సంప్రదించవచ్చు

➡️వాట్సాప్ లో దుర్బషలాడినా…దూషించినా అడ్మిన్ తో పాటు గ్రూప్ సభ్యుల మీద చర్యలు తప్పవు

మంగళగిరి:సోషల్ మీడియా మీద గట్టి నిఘా ఏర్పర్చామని డీజీపీ గౌతం సవాంగ్ అన్నారు.బుధవారం మంగళగిరి డీజీపీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డీజీపీ గౌతం సవాంగ్ మాట్లాడుతూ సోషల్ మీడియాలో వచ్చే వార్తలు అవాస్తవాలు అయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ప్రభుత్వం మీద గాని ప్రభుత్వ అధికారుల మీద కించపర్చుతూ పలు వ్యాఖ్యలు చేస్తే కేసులు నమోదు చేస్తామని అన్నారు.అంతేకాక సోషల్ మీడియాలో మహిళల చిత్రాలను పంపించినా అసభ్య వ్యాఖ్యలు మాట్లాడినా శిక్షార్హులు అవుతారని పేర్కొన్నారు.సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా దూషించినా ,క్రిమినల్ పేర్లను సంబోదిస్తూ వ్రాసినా కూడా కేసులు నమోదుచేస్తామని స్పష్టం చేశారు.అంతేకాకుండా ఒక వ్యక్తి గురించి కించపర్చుతూ వ్యాఖ్యలు చేసి తొలిగించినా కేసులు నమోదు చేస్తామని, తమ దగ్గర ఐటీ టెక్నాలజీ ఉందని దీనివలన తొలిగించిన మెసేజ్ లను కూడా పరిగణంలోనికి తీసుకుని కేసులు నమోదు చేస్తామని వెల్లడించారు.

వాట్సప్ గ్రూపుల గురించి డీజీపీ ప్రస్తావిస్తూ…

వాట్సప్ గ్రూపులలో కూడా నిరాధారమైన వార్తలు వ్రాస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందేనని డిజీపీ గౌతం సవాంగ్ అన్నారు.వాట్సప్ గ్రూపులలో వ్యక్తి గత దూషణలు చేస్తూ సంభాషించినా, దుర్బషలాడినా గ్రూప్ అడ్మిన్ తో పాటు గ్రూప్ సభ్యుల మీద చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నిరాధారమైన వార్తలు వ్రాస్తే 9071666667 ఈ నెంబర్ కు సంప్రదించి ఆ వార్త నిజమో కాదో పరిశీలించుకోవచ్చని సూచించారు.లాక్ డౌన్ వలన సోషల్ మీడియా హవా కొనసాగిందని దీని కట్టడికి అన్ని కసరత్తులు చేస్తున్నామని వెల్లడించారు.

About The Author