విశాఖ వైద్యుడు సుధాకర్‌ డిశ్చార్జికి హైకోర్టు సమ్మతి…


:-విశాఖ వైద్యుడు సుధాకర్‌ తల్లి వేసిన హేబియస్‌ కార్పస్‌ హౌస్ మోషన్‌ పిటిషన్‌ను హైకోర్టు విచారించింది.

:-విశాఖ వైద్యుడు సుధాకర్‌ డిశ్చార్జికి హైకోర్టు సమ్మతించింది.

:-సీబీఐ విచారణకు సహకరించాలని డాక్టర్‌ సుధాకర్‌కు సూచించింది.

:-ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు తెలియజేసి ఎప్పుడైనా డిశ్చార్జి కావొచ్చని పేర్కొంది.

:-మరోవైపు సుధాకర్‌ కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది.

:-నర్సీపంట్నం చేరుకున్న సీబీఐ అధికారులు… స్థానిక మున్సిపల్‌ కమిషనర్‌ కృష్ణవేణిని విచారించారు.

:-తొలుత సుధాకర్‌ పనిచేస్తున్న ఆసుపత్రికి వెళ్లి సర్వీసు రికార్డు, హాజరుపట్టికను పరిశీలించారు.

:-ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

About The Author