స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన టూటౌన్ పోలీసులు..
*సీఐ ఉమర్ నేతృత్వంలో విస్తృత తనిఖీలు..*
ఈ రోజు పోలీస్ కమిషనర్ ఆదేశాలు ప్రకారం విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న 2టౌన్ స్టేషన్ ప్రాంతంలో చిట్టినగర్ సెంటర్ వద్ద స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు..
*ఈ సందర్భంగా సీఐ ఉమర్ మాట్లాడుతూ..*
విజయవాడ సిటీ లో బైకుల పైన కానీ కార్లు పైన కానీ ప్రెస్, పోలీస్, సినిమా వాళ్ళ పేర్లు, సినిమా డైలాగులు, సినిమా పేర్లు, రాజకీయ నాయకుల పేర్లు కానీ రాసి ఉంటే వాటిని తొలగించి ఫైన్ విధించడం జరుగుతుందని సీఐ తెలిపారు..
మోటార్ వెహికల్ యాక్ట్ నిబంధనల ప్రకారం వెహికల్స్ కి స్టిక్కరింగ్ వేయడం నేరమని అన్నారు..
అలాగే టు వీలర్ కి వేరే సైలెన్సర్ ఉపయోగించి వాహనాలు నడుపుతున్నారని దాని వల్ల శబ్ద కాలుష్యం ఎక్కువగా వస్తుందని అన్నారు..
శబ్ద కాలుష్యం వల్ల వృద్ధులు చాలా మంది తీవ్ర ఇబ్బంది పడుతున్నారని సీఐ తెలిపారు..
కాబట్టి యువత సైలెన్సర్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని లేనిపక్షంలో వాహనాల యాక్ట్ ప్రకారం వారి పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు..
చిట్టినగర్ లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన అనంతరం ఏదైతే కార్లకు బ్లాక్ ఫిలిం, పేర్లు ఉన్నాయో వాటిని తొలగించి వారికి చలానా విధించారు..
ఈ తనిఖీల్లో 2 టౌన్ సిఐ ఉమర్ తో పాటు ఎస్ఐ లు కృష్ణ ,విశ్వనాథం పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు