అక్కడ తగ్గితే..ఇక్కడ పెరిగాయి: రాహుల్.


లాక్‌డౌన్‌ విఫలమైందంటూ కేంద్రంపై విమర్శలు
దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో మహమ్మారి కట్టడిలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాటల దాడికి దిగారు. భాజపా నేతృత్వంలోని ప్రభుత్వం లాక్‌డౌన్‌ను విధించి, ఆశించిన ఫలితాలను రాబట్టలేకపోయిందని ట్విటర్ వేదికగా మండిపడ్డారు. ఛార్ట్ రూపంలో వైరస్‌ తీవ్రతను ఇతర దేశాలతో పోల్చుతూ విమర్శలు చేశారు.
‘విఫలమైన లాక్‌డౌన్‌ ఇలా కనిపిస్తోంది’ అంటూ స్పెయిన్‌, ఇటలీ, జర్మనీ, యూకే, భారత్‌  వంటి దేశాల్లో లాక్‌డౌన్‌ తరవాత వైరస్ ప్రభావాన్ని వివరించే కొన్ని ఛార్ట్‌లను షేర్ చేశారు. భారత్‌ మినహా ఆయన ప్రస్తావించిన దేశాల్లో లాక్‌డౌన్ తరవాత కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. కానీ, మనదేశంలో కేసుల తీవ్రత క్రమంగా పెరుగుతూవస్తోంది. కరోనా వైరస్‌ను కట్టడి చేయనందున మనదేశంలో లాక్‌డౌన్‌ నిర్ణయం విఫలమైందని, కేసులు పెరుగుతున్న తరుణంలో భారత్ లాక్‌డౌన్‌ను సడలించిందని ఇటీవల కేంద్రంపై రాహుల్  విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.  

About The Author