చైన్ స్నాచర్ల అరెస్ట్..!

తెలంగాణ:హైదరాబాద్ పాతబస్తీకి చెందిన​ మహమ్మద్​ అంజద్​, మహమ్మద్​ షోయబ్​ అనే ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు.మద్యం, గంజాయికి అలవాటు పడి సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో చైన్​ స్నాచింగ్​లు​ చేయటం మొదలు పెట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.గతనెల 30న అబిడ్స్​ వద్ద మహిళ మెడలో నుంచి మంగళసూత్రం స్నాచింగ్​ చేసి పరారైనట్లు వెల్లడించారు.

బాలాపూర్​లో కూడా ఇదే తరహాలో స్నాచింగ్​కి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. సీసీ ఫుటేజీలను పరిశీలించిన అనంతరం వీరిద్దరిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. వారి నుంచి ఓ ద్విచ్రవాహనం, 45 గ్రాముల మంగళ సూత్రాలను స్వాధీనం చేసుకున్నారు.కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను రిమాండ్​కు తరలించారు

About The Author