జూలై 21 నుంచి అమర్‌నాథ్ షురూ తాజా నిబంధనలివి

శ్రీనగర్: అమర్‌నాథ్ యాత్ర జూలై 21 నుంచి ప్రారంభం కానుందని అధికారులు ప్రకటించారు. జూలై 21 నుంచి ఆగస్టు 3 వరకూకొనసాగుతుందనితెలిపారు. ఈసారి కేవలం 15 రోజులు మాత్రమే కొనసాగుతుందని అమర్‌నాథ్ ఆలయ కమిటీ పేర్కొంది.అయితే అమర్‌నాథుడికి జరగాల్సిన మొదటి పూజను పూజారులు శుక్రవారం నిర్వహించారు. అయితే 55 ఏళ్ల లోపున్న భక్తులను మాత్రమే తాము ఈ యాత్రకు అనుమతిస్తామని, అయితే కోవిడ్ సోకలేదని, కోవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్లను చూపించాలని అధికారులు నిబంధనలు విధించారు.భక్తులు ఆన్‌లైన్‌లోనే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, సాధు సంతువులకు మాత్రం ఈ నిబంధన వర్తించదని అధికారులు తెలిపారు. గుహలో ఈ 15 రోజుల పాటు జరిగే హారతిని మాత్రం భక్తుల సౌకర్యార్థం లైవ్ టెలికాస్ట్ చేస్తామని ప్రకటించారు. కార్మికులు అందుబాటులో లేకపోవడం, ట్రాక్ నిర్మాణపు పనులు జరుగుతున్న నేపథ్యంలో బల్టల్ బేస్ క్యాంపు నుంచి గందేర్బల్ వరకూ హెలికాప్టర్‌ల సౌకర్యం అందుబాటులో ఉంటుందని అధికారులు ప్రకటించారు.

About The Author