ల్యాంకో కార్మికుడు ఆత్మహత్య

శ్రీకాళహస్తి:పని వత్తితో ల్యాంకో కార్మికుడు ఆత్మహత్య  శ్రీకాళహస్తి మండలంలోని రాచగున్నేరి సమీపంలో ఉన్న ల్యాంకో కర్మాగారంలో పనిచేసే కార్మికుడు భరత్ ప్రజాపతి(25) ఆదివారం తెల్లవారుజామున ఇంట్లో కరెంటు పట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పశ్చిమ బెంగాల్ కు చెందిన భరత్ ప్రజాపతి కాంట్రాక్టు కార్మికుడుగా పనిచేస్తున్నాడు. లాక్ డౌన్ కారణంగా కార్మికులు ఎక్కువగా విధులకు రాకపోవడంతో ఉన్న కొద్ది మంది కార్మికులు చేత ఎక్కువ పని చేయిస్తున్నట్లు సమాచారం. ఈ నేపధ్యంలో నే కంపెనీ యాజమాన్యం, కాంట్రాక్టర్లు వేధింపులు అధికమయ్యాయని కార్మికులు చెబుతున్నారు. వేధింపులు భరించలేక ఆదివారం రాత్రి రాచగున్నేరి లో తను నివాసం ఉంటున్న ఇంట్లో కరెంట్ పట్టుకుని మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. విశ్రాంతి లేకుండా మూడు షిప్టులు డ్యూటీ లు వేయడం వలనే ఆత్మహత్య చేసుకున్నట్లు తోటి కార్మికులు తెలిపారు. ఈ మేరకు రూరల్ సిఐ విజయ్ కుమార్ రాచగున్నేరి కి చేరుకుని స్థానికులు నుంచి వివరాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం బాడీని శ్రీకాళహస్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని రాచగున్నేరి మాజీ సర్పంచ్ బొల్లినేని జగన్నాధంనాయుడు డిమాండ్ చేశారు.

About The Author