కరోనాతో హైదరాబాద్ లో క్రైమ్ రిపోర్టర్ మనోజ్ మరణం…
ఏందిరా భాయ్ ఈ దారుణం….
*జీతం సరిగా ఇవ్వని మీడియా కోసం జీవితం ఇచ్చేశావా*….
– న్యూస్ కవరేజ్ కోసం వెళితే దారిలో ప్రమాదం జరిగినా పనిచేసే సంస్ధలు పైసా ఇవ్వరని తెలుసు…
– పైగా జాగ్రత్తగా ఉండక్కర్లేదా అని జాలి చూపించి ఉచిత సలహాలు ఇచ్చి చేతులు దులుపుకొనే మేనేజ్మెంట్లు ఉన్నాయని తెలుసు..
– రేపు లీవ్ తీసుకుని ఎల్లుండి వచ్చేయ్ అనే హృదయంలేని ఇన్చార్జులు…
ఉన్నారని తెలుసు..
– అన్నం తినే సమయంలో పక్క ఛానల్ లో బ్రేకింగ్ పడుతుంటే చేతులు కడుక్కొని పరిగెత్తాలని తెలుసు…
– అర్దరాత్రి గాఢ నిద్రలో ఫోన్ రింగ్ అయితే పరిగెత్తాలని తెలుసు….
– 24 గం.లు ఫోన్ & వాట్సప్ ఆన్ లో ఉండాలని తెలుసు..
– మిగిలిన బీట్లు లాగ కాకుండా 24 గం.లు డ్యూటి చేయాలని తెలుసు..
– రెగ్యులర్ గా మార్చురి దగ్గర వాసన పీల్చాలని తెలుసు…
– శవాలతో సావాసం, పోలీసులతో పరుగులు ఉంటాయని తెలుసు..
– సమాచారం వస్తే 5 నుండి 10 నిమిషాల్లో స్పాట్ లో ఉండాలని తెలుసు…
– కుటుంబంతో ఒక పూట కూడా గడిపే అవకాశం ఉండదని తెలుసు..
– మూడు పూటల టైమ్ ప్రకారం తినడం అంటే అద్బుతం అని తెలుసు…
– టైమ్ కి తినక ఆరోగ్యం పాడైపోతుందని తెలుసు…
– ఒక్కరోజు రెస్ట్ తీసుకుంటే పై నుండి పడే అక్షింతలు తెలుసు…
– హెల్త్ ఇన్స్యూరెన్స్ లేదని తెలుసు..
– ఎవడూ సాయం చేయడని తెలుసు..
– జీతం టైయానికి ఇవ్వరని తెలుసు..
– జీవితానికి గ్యారంటి లేదని కూడా తెలుసు..
రెగ్యులర్ #క్రైమ్_రిపోర్టింగ్ చాలదన్నట్టు..
– కరోనా కవరేజ్ ఇవ్వాలని తెలుసు..
– కరోనా వైరల్ వైరస్ అని తెలుసు..
– జాగ్రత్తలు తీసుకొనే డాక్టర్లే బలైపోతున్నారని తెలుసు..
– మిగిలిన స్టాఫ్ అంతా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినా నువ్వు మాత్రం ఫీల్డ్ లో ఉండాలని తెలుసు..
– కోవిడ్ హాస్పటల్స్ దగ్గరకి, కంటోన్మెంట్ ఏరియాల దగ్గరకి వెళ్లాలని తెలుసు…
– కరోనా సోకే ప్రమాదం ఉందని తెలుసు…
ఇన్ని తెలిసి కూడా ధైర్యంగా పనిచేస్తున్నాడంటే అది *క్రైమ్_రిపోర్టర్* అంటే…..
ఎన్నో వార్తలు అందించిన రిపోర్టర్లు వార్తగా మారడం నిజంగా దురదృష్టకరం… ప్రతి క్రైమ్ రిపోర్టర్ తీవ్రఅనారోగ్యంతో గాని ప్రమాదాల్లో మరణించక తప్పదు.