తిరుమలలో టిటిడి అదనపు ఈవో తనిఖీలు
తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం నుండి మూడు రోజులపాటు ప్రయోగాత్మకంగా దర్శనం కల్పించేందుకు చేసిన ఏర్పాట్లను ఆదివారం సాయంత్రం టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి తనిఖీ చేశారు.కోవిడ్-19 వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో మార్చి 20వ తేదీ నుండి తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులకు నిలుపుదల చేసిన విషయం తెలిసిందే. సుమారు 80 రోజుల తర్వాత స్వామి వారిని దర్శించుకునేందుకు టిటిడి ఏర్పాట్లను పూర్తి చేసింది.ఈ క్రమంలో సీనియర్ అధికారులతో కలిసి అదనపు ఈవో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని క్యూలైన్లు ఇతర ఏర్పాట్లను తనిఖీ చేశారు. భక్తులు భౌతిక దూరం పాటించేలా రూపొందించిన మార్కింగ్, శానిటైజర్ లు, హుండీ దగ్గర చేసిన ఏర్పాట్లు, భక్తులకు సూచనలు ఇచ్చేందుకు.చేయాల్సిన ప్రకటనలు తదితరాలను పరిశీలించారు.ట్రయల్ రన్ లో మొదటి రెండు రోజులు టీటీడీ ఉద్యోగులకు, మూడవ రోజు తిరుమల స్థానికులకు దర్శనం కల్పిస్తారు. జూన్ 11వ తేదీ నుండి భక్తులు దర్శనం చేసుకునేందుకు ఏర్పాట్లు చేపట్టారు.