అనంతపురము ప్రజలకు ముఖ్య గమనిక…
పౌర సరఫరాల శాఖ వారు కొత్త రైస్ కార్డులు,కార్డులు సభ్యులను చేర్చుట,తొలగించుట,కార్డు సరెండర్ చేయడం మరియు స్ప్లిట్టింగ్ గురించి వివరణ ఇచియున్నారు మరియు వాటికి సంబంధించి వర్క్ ఫ్లో కూడా తెలియజేశారు….
కొత్త రైస్ కార్డు
కొత్త రైస్ కార్డు కి సంబంధించి దరఖాస్తు దారులు ఏ కార్డులో లేనట్లయితే వారికి అప్లై చేయవచ్చు …..కుటుంబం లో అబ్బాయి కి వివాహం జరిగి కొత్త కార్డు కావాలంటే ముందుగా తన భార్యను అబ్బాయి కుటుంబ కార్డు లో యాడ్ చేయాలి …..తర్వాత వారిని స్ప్లిట్ చేయాలి…..స్ప్లిట్ చేశాక కొత్త కార్డు కి అప్లై చేయవలసి వస్తుంది …..
కార్డు లో సభ్యులను చేర్చూట
కార్డు లో సభ్యులను చెర్చుట కేవలం చిన్న పిల్లలు మరియు వివాహం జరిగిన స్త్రీల ను మాత్రమే కార్డు లో చేర్చగలము….
చిన్న పిల్లని చేర్చుటకు కచ్చితంగా వారి బర్త్ సర్టిఫికేట్ మరియు ఆధార్ కార్డు కావలెను …..వివాహం అయిన స్త్రీ కి ఆమె ఆధార్ కార్డు,ఆమె తల్లి తండ్రుల రైస్ కార్డు నంబర్ మరియు వివాహం చేసుకున్న వారి కుటుంబం రైస్ కార్డు కావలెను…..వీరిని వారి అమ్మ వాళ్ళ కార్డు నుండి డైరెక్ట్ గా యాడ్ మెంబర్ సర్వీస్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయవచ్చు…..
కార్డు నుండి తొలగింపు
రైస్ కార్డు నుండి తొలగింపు కేవలం చనిపోయిన వారికి మాత్రమే….. ఎవరైనా రైస్ కార్డు లో ఉన్న సభ్యులు చనిపోయిన ట్లైతే వారికి మాత్రమే డిలీట్ మెంబర్ సర్వీస్ వర్తిస్తుంది……
స్ప్లిట్టింగ్
స్ప్లిట్ చేయాలంటే ముందు ఆ సభ్యులు ఒకటే రైస్ కార్డు నందు ఉండవలెను….అప్పుడు మాత్రమే స్ప్లిట్ చేయడం సాధ్య మవుతుంది….
అలాగే స్ప్లిట్ అవ్వాల్సిన సభ్యులు కచ్చితంగా e-kyc చేయించు కోవాలి లేదంటే స్ప్లిట్ సాధ్యం కాదు……
కుటుంబం లో తల్లి తండ్రుల లలో ఒకరు మాత్రమే ఉన్నట్లైతే అంటే తల్లి ఉండి తండ్రి లేకపోవడం లేదా తండ్రి ఉండి తల్లి లేనట్లయితే స్ప్లిట్ అవ్వడం వీలు కాదు…..అందరూ ఆ రైస్ కార్డు నందు ఉండవలసిందే…..
పైన తెలిపిన నాలుగు సేవలకు e-kyc చాలా ముఖ్యం…. e-kyc జరిగితేనే ఏ సేవయిన వర్తిస్తుంది….
ప్రతి సేవకు టైమ్ పీరియడ్ 5 రోజులు మాత్రమే….5 రోజులు దాటితే ఆలస్యానికి వివరణ ఇవ్వవలసి ఉంటుంది….
పై నాలుగు సేవలకు సంబంధించి వర్క్ ఫ్లో ఆల్రెడీ ఇ చ్చియిన్నారు ….వాటి ప్రకారం ప్రతీ సర్వీస్ కి VRO వాలంటీర్ తో కలసి ఫీల్డ్ సర్వే నిర్వహించాలి మరియు e-kyc చేయించాలి…..
ఫీల్డ్ సర్వే ఫామ్ లు vro స్పందన లాగిన్ లో generate అవుతాయి అవితీసుకొని ఫీల్డ్ సర్వే చేసి అప్డేట్ చేయాలి తర్వాత వచ్చిన సామాజిక తనికీ లిస్ట్ ను సచివాలయం లో డిస్ప్లే చేయాలి…..ఏవైనా అభ్యంతరాలు ఉంటే అవి అప్డేట్ చేస్తే MRO గారి లాగిన్ లో డిజిటల్ సిగ్నేచర్ చేశాక కొత్త రైస్ కార్డు/రైస్ కార్డు నందు మార్పులు/స్ప్లిట్ అయ్యి జెనరేట్ అవుతుంది….
గ్రామ వార్డ్ సచివాలయం వెబ్సైట్ లో సివిల్ సప్లిస్ డిపార్ట్మెంట్ ఆప్షన్ అప్డేట్ చేస్తారు…..
అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రజా సాధికార సర్వే నీ పూర్తిగా ఆపివేస్తున్నారు…..ఇప్పటి వరకు సమాచారం ప్రజా సాధికార సర్వే నుండి తీసుకున్నారు కాని ఇప్పటి నుండి వాలంటీర్లు హౌస్ హోల్డ్ సర్వే డేటా తీసుకుంటారు…..
అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ఎటువంటి వివక్ష లేకుండా అన్ని సంక్షేమ పథకాలు అందించాలని శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం నిర్ణయించింది కావున అర్హులు అందరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతూ
ఇట్లు,
మీ
*అనంత వెంకటరామిరెడ్డి*
ఎమ్మెల్యే అనంతపురము.