ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. రేపట్నుంచి బోర్డర్‌లో తనిఖీల్లేవు..


ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. రేపటి నుంచి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న సరిహద్దు చెక్ పోస్టులను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. లాక్ డౌన్ సడలింపులలో భాగంగా ఇప్పటికే రాష్ట్రాల మధ్య రాకపోకలకు అనుమతిచ్చిన నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీనితో దాదాపు మూడు నెలల తర్వాత రెండు రాష్ట్రాల మధ్య అనుమతులు లేకుండా రాకపోకలు జరగనున్నాయి. కాగా, ఇప్పటికే వేరే రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న తెలంగాణ చెక్ పోస్టులను ఎత్తివేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంతో రేపట్నుంచి తెలంగాణ, ఏపీ మధ్య రాకపోకలు జోరందుకోనున్నాయి.

అటు APSRTC రేపట్నుంచి మరిన్ని బస్సులు తిప్పేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది. యధావిధిగా సీట్లను తగ్గించి బస్సు సర్వీసులను తిప్పాలని నిర్ణయించింది. ఇక గత నెల 21 నుంచి తిరుగుతున్న బస్సుల ద్వారా ఇప్పటివరకు రూ. 29.44కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. కాగా, ఏపీలో బస్సులు 49 శాతం అక్యుపెన్సీతో నడుస్తుండగా.. ఆర్టీసీలో ఆన్లైన్ టికెట్ బుకింగ్ 32 శాతానికి చేరినట్లు అధికారులు తెలిపారు.

About The Author