ఉచితంగా ఇసుక, సీఎం జగన్ గుడ్ న్యూస్

ఇసుక సరఫరా విషయంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక ఇసుక రీచ్‌ల దగ్గర ఎటువంటి అక్రమాలు జరగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే గుడ్ న్యూస్ కూడా వినిపించారు. గ్రామాల్లో ఉన్నవాళ్లు తమ సొంత అవసరాల కోసం ఎడ్ల బండ్ల ద్వారా 5 కిలోమీటర్ల పరిధిలో ఉచితంగా ఇసుక తెచ్చుకోవచ్చని సీఎం జగన్‌ తెలిపారు. అలాగే ఇకపై గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇసుక బుకింగ్ చేసుకునే అవకాశం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అంతేకాక నియోజకవర్గానికి ఒకటే రేటు ఉండాలని స్పష్టం చేశారు.

స్పందన కార్యక్రమంపై సీఎం జగన్‌ మంగళవారం(జూన్ 9,2020) అధికారులతో వీడియో కాన్పరెన్స్‌ నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో అన్ని ఇసుక రీచ్‌లను తెరవాలని అధికారులను ఆదేశించారు.

జూన్ చివరి నాటికి రోజుకు 3 లక్షల టన్నుల ఇసుక నిల్వ లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు.

* ఇసుక రీచ్‌లన్నీ తెరవాలని సీఎం జగన్ ఆదేశం

* వర్షాలు ప్రారంభయ్యే నాటికి 70 లక్షల మెట్రిక్‌ టన్నులు ఇసుక నిల్వ చేయాలి

* జూన్‌ చివరి నాటికి రోజుకు 3 లక్షల టన్నుల లక్ష్యంగా పెట్టుకోవాలి

* ప్రస్తుతం లక్షన్నర వరకూ ఇస్తున్నాం

* శ్రీకాకుళం, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో ఇసుక ఉత్పత్తిని బాగా పెంచాలి

* రోజుకు 3లక్షల టన్నులు ఉత్పత్తి చేయాలి

* అన్ని రకాల రీచ్‌లను తెరిచి అందులో కార్యకలాపాలు నిర్వర్తించాలి

* రీచ్‌లు ఎక్కువగా ఉన్న శ్రీకాకుళం, ఉభయగోదావరి, కృష్ణ, గుంటూరు, నెల్లూరు, కడప జిల్లాలకు చెందిన జిల్లాల్లో ఇసుక ఉత్పత్తి పెరగాలి

* కొత్త సోర్స్‌లను కూడా గుర్తించి అక్కడ రీచ్‌లను ఏర్పాటు చేయాలి

* ఎల్లుండి నుంచి గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఇసుకను బుక్‌ చేసుకోవచ్చు

* దీనికి సంబంధించిన జేసీ పూర్తి బాధ్యత తీసుకోవాలి

* కలెక్టర్లు పర్యవేక్షణ చేయాలి

* సొంత అవసరాల కోసం గ్రామాల్లో ఉన్నవాళ్లు పక్కనే ఉన్న ఎడ్లబండ్ల ద్వారా 5 కి.మీ పరిధిలో ఇసుకను తెచ్చుకోవచ్చు

* దీనికి సంబంధించిన జీవో విడుదల అవుతుంది

* గ్రామ సచివాలయంలో దీనికి సంబంధించిన అనుమతులు తీసుకోవచ్చు

* బల్క్‌ బుకింగ్‌ అనుమతులు జాయింట్‌ కలెక్టర్‌ చూసుకోవాలి

* పారదర్శకంగా ఈ విధానం ఉండాలి

* ఎస్‌ఓపీలను కూడా మీకు అంది ఉంటాయి

* దీనికి సంబంధించి ఎస్‌ఓపీ రేపటి నుంచి అమల్లోకి వస్తుంది

ఏపీలో సినిమా షూటింగ్‌లకు సీఎం జగన్ అనుమతి

About The Author