ర్యాష్ డ్రైవింగ్ను ఎట్టి పరిస్థితిలో కూడా ఉపేక్షించేది లేదు
తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి శ్రీ ఏ.రమేష్ రెడ్డి ఐ.పి.యస్…
తిరుపతి:ఈ రోజు తిరుపతి నగరం నందు బుల్లెట్ వాహనాలకు సైలేన్సుర్లు మార్పిడి చేసి అదిక శబ్దం వచ్చే విధంగా ఏర్పాటు చేసుకొని శబ్ద కాలుష్యన్ని విపరీతంగా కలిగిస్తునారు. వీటిపై నగరంలో స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించి అధిక శబ్దం కలిగించే బుల్లెట్లను గుర్తించి వాటివలన కలిగే ఇబ్బందిలను గురించి పత్రికా ముఖంగా నగర ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణంలో జిల్లా యస్.పి.శ్రీ రమేష్ రెడ్డి ఐ.పి.యస్ గారు తెలియపరిచారు.
ఈ సందర్బంగా జిల్లా యస్.పి. గారు మాట్లాడుతూ కరోనా లాక్ డౌన్ సమయం లో తిరుపతి జిల్లా పోలీస్ వారు మరియు ట్రాఫిక్ పోలీస్ వారు నిబద్తతో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎంతో శ్రమతో విధులు నిర్వహించారు. దాదాపు సుమారు 3000 లకు పైగా ట్రాఫిక్ ఉల్లంగన కేసులను నమోదు చేయడం జరిగింది కాని కొత్తగా యువత, కాలేజీ విద్యార్ధులు ఫ్యాషన్ లు కొరకు బైక్ లకు రిజిస్టర్గా వచ్చిన సైలేన్సుర్లను మార్చి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తునారు. ఇలాంటి వారిని జిల్లా మొత్తం ఎక్కడ వాహనాలు నడిపినా అట్టి వారిని వదిలిపెట్టే ప్రసక్తేలేదు, మన చుట్టూ ఎన్నో హాస్పిటల్స్, స్కూల్స్, దేవాలయాలు, ఇంకా ముఖ్యమైన ప్రదేశాలు ఉనాయి. ఈ అధిక శబ్దం వలన వాటికి బంగం కలిగించకూడదు, రిజిస్టర్ ప్రకారం వాహనానికి వచ్చిన సైలేన్సుర్లను మార్చకండి దయచేసి తల్లి తండ్రులు కూడా గమనించి ముచట్ట పడకుండా బాద్యత వహించండి. ఇలాంటి వారి పై అవసరమైతే క్రిమినల్ కేసులను నమోదు చేయడంతో పాటు స్వచ్ఛందగా ట్రాఫిక్ విధులు నిర్వహించే విధంగా పనిష్మెంట్లు ఇప్పిస్తాం. అంతేకాకుండా అధిక శబ్దం వలన వాతావరణ కాలుష్యం కూడా ఏర్పడ్తుంది, ర్యాష్ డ్రైవింగ్ను ఎలాంటి పరిస్తిత్లో కూడా ఒప్పుకునేది లేదు, ఎదుటి వ్యక్తి ప్రాణాన్ని హరించే హక్కు మనకు లేదు మనందరికీ ఒక కుటుంబం ఉంటుంది అందులో తల్లి, తండ్రి, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు ఇలా ఎన్నో బంధాలు ముడిపడి ఉంటుంది. మనకు మన ఇంటి సభ్యులపై ఎంత ప్రేమ ఉంటుందో అలాగే ఎదుటవారికి కూడా, మనం ఇతరులకు కలిగించే హాని మనకు ఇతరుల వల్ల హాని జరిగితే ఎలా ఉంటుందో ఉహించండి… ప్రేమైన ఒక్కటే ప్రాణమైన ఒక్కటే ఏది కొల్పోయీన తిరిగి రాదు, ర్యాష్ డ్రైవింగ్, ఫ్యాషన్లపై ఉన్న శ్రద్ధ మి ఎదుగుధలమీద చూపించండి ప్రయోజుకులు అవుతారు అంతేకాని మేము ఇంతే మత్తులోనే ఉండాలి మత్తు పదార్ధాలు సేవించాలి గుండాగిరి, గ్రూపిజం చేయాలి అనుకుంటే ఇదే ఆకరి సారి, జిల్లాని మరిచిపొండి. తీరిక లేకున్నా వెంటాడుతాం. జిల్లా పోలీస్ యంత్రాంగం అన్నిటికి సిద్ధంగా ఉంది. ఎలాంటి పరిస్థితిలు వచ్చిన ఎదురుక్కోవడానికి అని బైక్ రైడర్లను హెచ్చరించారు. అనంతరం టౌన్ క్లబ్ కూడలి వద్ద ట్రాఫిక్ క్రమబద్దీకరణపై అధికారులకు పలు ఆదేశాలు జారీచేసారు.ఈ కార్యక్రమం లో డి.యస్.పి.లు, యస్.బి గంగయ్య, ట్రాఫిక్ మల్లికార్జున, ట్రాఫిక్ ఇస్మాయిల్, సి.ఐ సురేష్ కుమార్, సిబంది పాల్గొనారు.