షుగర్ కి వేపాకు రోజు 5 ఆకులను తింటే చాలు…
ప్రస్తుత కాలంలో మారుతున్న జీవనశైలి కారణంగా చాలా మంది డయాబెటిస్ తో బాధపడుతున్నారు. ఆహార అలవాట్లు, నిద్రలేమి, ఒత్తిళ్లు, జన్యుపరమైన లోపాలు… రకరకాల కారణాల వల్ల డయాబెటిస్ వస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ఏడాదికి 16 లక్షల మంది డయాబెటిస్ వల్ల చనిపోతున్నారని వెల్లడైనది. ఈ మధ్య పుట్టే పిల్లలకు కూడా ఈ వ్యాధి వచ్చేస్తోంది. 2030 నాటికి ప్రపంచంలో అత్యంత ఎక్కువగా మనుషుల్ని చంపేసేవాటిలో డయాబెటిస్ ఏడో స్థానంలో ఉటుందని WHO అంటోంది. ఇలాంటి ప్రమాదకరమైన డయాబెటిస్‌కి వేపాకులతో చెక్ పెట్టవచ్చు. వేపాకులు బ్లడ్ లో షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తాయి.
బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ ఎక్కువైతే డయాబెటిస్ వస్తుంది. దీనిని తేలిగ్గా తీసుకుంటే క్రమంగా గుండెం, రక్త నాళాలు, కళ్లు, కిడ్నీలు, నరాలు దెబ్బతింటాయి. అందువల్ల ఈ వ్యాధి ఉన్నవారు ఏం తినాలన్నా జాగ్రత్తపడాలి. తినే ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. అలాగే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అన్నీ ఉండే ఆహారం తీసుకోవాలి. వేపలో యాంటీసెప్టిక్, వ్యాధుల్ని తరిమికొట్టే గుణాలుంటాయి. అందుకే ఇండియా, చైనా మందుల తయారీలో వేపను ఎక్కువగా వాడుతున్నారు. వేప చెట్టులోని ఆకులు, పువ్వులు, గింజలు, పండ్లు, బెరడు అన్నింటిలోనూ ఔషధ గుణాలున్నాయి. డయాబెటిస్ ఉన్నవారు రోజూ కొన్ని వేపాకులను నమలాలి.
వేపాకులు మన శరీరంలోని విష వ్యర్థాల్ని బయటకు తరిమికొడతాయి. శరీర మంటలు, ఇన్ఫెక్షన్లు, జ్వరం, చర్మ వ్యాధులు, నోటి సమస్యలు ఇలా అన్నింటికీ వేప ఔషధంగా పనిచేస్తోంది. వేప డయాబెటిస్‌ని పూర్తిగా నయం చెయ్యలేకపోయిన వ్యాధి తీవ్రతను తగ్గించగలదు. వ్యాధి వేగంగా పెరగకుండా చెయ్యగలదని పరిశోధనల్లో తేలింది. వేపాకుల్లో ఫ్లేవనాయిడ్స్, ట్రిటెర్పెనాయిడ్, యాంటీ వైరల్ గుణాలుంటాయి. అవి బ్లడ్‌లో గ్లూకోజ్ లెవెల్స్ పెరగకుండా చేస్తాయి. అంతేకాదు మీరు వేపాకులతో తయారుచేసిన కషాయాన్ని తాగితే మీ షుగర్ కంట్రోల్లో ఉంటుంది. వేపాకులను 5 నిమిషాలపాటూ మరిగించి ఆ నీటిని వడగట్టి రోజుకు రెండుసార్లు తాగాలి.