టీటీడీ గోవిందరాజస్వామి టెంపుల్ శానిటరీ ఇన్స్‌పెక్టర్‌కు కరోనా : ఆలయం మూసివేత

తిరుపతి: తిరుమల తిరుపతికి అనుబంధంగా ఉన్న గోవిందరాజస్వామి ఆలయంలో పని చేసే శానిటరీ ఇన్స్‌పెక్టర్ కు కరోనా సోకింది. దీంతో ఈ ఆలయాన్ని మూసివేయాలని ఈవో ఆదేశాలు జారీ చేశారు. రెండు రోజుల పాటు ఈ ఆలయాన్ని మూసివేయనున్నారు. ఆలయాన్ని శానిటేషన్ చేస్తారు. ఆ తర్వాత ఆలయాన్ని తెరవనున్నారు.

 గోవిందరాజస్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న పబ్లిక్ హెల్త్ కార్యాలయంలో శానిటరీ ఇన్స్ పెక్టర్ కు కరోనా సోకిందని వైద్యులు తేల్చారు.

దీంతో పబ్లిక్ హెల్త్ కార్యాలయంతో పాటు పాత హుజూర్ కార్యాలయాన్ని కూడ మూసివేయాలని అధికారులు నిర్ణయం తీసుకొన్నారు.శానిటరీ ఇన్స్‌పెక్టర్‌తో పాటు ఆయనతో పాటు సన్నిహితంగా ఎవరెవరూ మెలిగిందో ఎవరో అనే విషయమూ ఆరా తీస్తున్నారు. శానిటరీ ఇన్స్ పెక్టర్ తో కలిసిన వారిని గుర్తించి పరీక్షలు నిర్వహించనున్నారు.

ఇప్పటి వరకు తిరుమలలో కరోనా కేసులు నమోదు కాలేదు. శానిటరీ ఇన్స్ పెక్టర్ కు కరోనా సోకడంతో అధికారులు జాగ్రత్తలు తీసుకొంటున్నారు. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకొంటున్నారు. ఈ నెల 11వ తేదీ నుండి సామాన్య భక్తులకు తిరుమల వెంకన్న దర్శనం కల్పిస్తున్నారు. ఈ తరుణంలో కరోనా కేసు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

 

About The Author