షాకింగ్ న్యూస్: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య

బాలీవుడ్ నటుడు, హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్నాడు.  ముంబైలోని తన నివాసంలో సుశాంత్ సింగ్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.   సుశాంత్ సింగ్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే విషయం తెలియాల్సి ఉన్నది. సుశాంత్ సింగ్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడనే విషయం తెలుసుకున్న బాలీవుడ్ ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్ అయ్యింది.  

ఎంఎస్ ధోని సినిమాతో సుశాంత్ సింగ్ మంచిపేరు తెచ్చుకున్నారు.  2008లో సుశాంత్ సింగ్ స్టార్ ప్లస్ లోని ఓ సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయం అయ్యారు.  ఆ సీరియల్ మంచి విజయం సాధించడంతో సుశాంత్ సింగ్ పేరు మారుమ్రోగిపోయింది. ఆ తరువాత కైపోచెయ్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుతుపెట్టారు.  ఈ సినిమా తరువాత శుద్ధ్ దేశీ రొమాన్స్, ఎంఎస్ ధోని, కేదారనాథ్, చిచ్చోరె సినిమాల్లో నటించి మెప్పించారు. కొన్ని రోజుల క్రితమే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ మేనేజర్ దిశా సలిన్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.  ఇది జరిగిన కొన్ని రోజులకే సుశాంత్ కూడా ఆత్మహత్య చేసుకోవడంతో బాలీవుడ్ ఇండస్ట్రీ షాక్ అయ్యింది.

About The Author