చిత్తూరు ఆలయాల్లో కరోనా కలకలం:కాణిపాకం ఆలయం మూసివేత
చిత్తూరు జిల్లా… కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలోకి భక్తుల అనుమతిని నిషేధించారు.ఎవరైనా కాణిపాకం రావాలని నిర్ణయించుకుంటే… ప్రస్తుతానికి రావొద్దని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఇందుకు ప్రధాన కారణం… ఆలయంలో పనిచేసే సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్ అని తేలింది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతూ… ఏపీలో ఎక్కువవుతూ ఉంటే… ప్రభుత్వ ఆదేశాల ప్రకారం… ఆలయ నిర్వాహకులు… ఆలయ సిబ్బంది అందరికీ మొన్న కరోనా టెస్టులు చేయించారు. వాటి రిపోర్టులు తాజాగా వచ్చాయి. వాటిలో ఒకరికి కరోనా ఉన్నట్లు తేలింది.
ఇది నిజంగా బాధాకరం. ఎందుకంటే కాణిపాకం ఆలయాన్ని ఎన్నో జాగ్రత్తలు తీసుకొని మరీ తెరిచారు
భక్తులు అన్ని విధాలా సోషల్ డిస్టాన్స్ పాటించేలా చేశారు. మాస్కులు తప్పనిసరి అన్నారు. అన్ని రూల్సూ పాటించినా… కరోనా వదల్లేదు.
అందువల్ల తాత్కాలికంగా భక్తులకు ఆలయ ప్రవేశాన్ని నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఆలయ ఈవో.జనరల్‌గా తిరుమలకు వచ్చే భక్తులు… కాణిపాకం వినాయక స్వామిని కూడా దర్శించుకుంటారు. ఓ బావిలో దొరికిన వినాయక మూల విరాట్టు విగ్రహం… క్రమంగా సైజు పెరుగుతోంది.
ఏళ్లు గడిచేకొద్దీ సైజు పెరుగుతూనే ఉంది. కొన్నేళ్ల కిందట… విగ్రహం కింద ఉండే ప్లేటు చిన్నదై పగిలిపోవడంతో… దాన్ని తొలగించి పెద్ద ప్లేటు ఉంచారు.
ఆ ఆలయ విశిష్టతల్లో ఇదీ ఒకటి. అందువల్లే తిరుమల దర్శనం తర్వాత… చాలా మంది కాణిపాకం వస్తుంటారు. ప్రతిజ్ఞలు కూడా చేస్తుంటారు. అలాంటిది మళ్లీ ఆలయంలో భక్తులకు నిషేధం అమలు చేయడం భక్తులకు నిరాశే. ఐతే… కరోనా దృష్టా ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదంటున్నారు అధికారులు.