గుడ్లగూబ కళ్ళలో దాగిన విజయ రహస్యం
ఇంటర్నెట్ డెస్క్: గుడ్లగూబ అంటే అందరికీ పెద్ద పెద్ద కళ్లు గుర్తుకు వస్తాయి. రాత్రిపూట మాత్రమే సంచరించే ఈ పక్షి గురించి ఎన్నో అపోహలు ప్రచారంలో ఉన్నాయి. దీన్ని చూస్తే అశుభమని, చెడు జరుగుతుందని చాలా మంది భావిస్తుంటారు. అయితే గుడ్లగూబలపై జరుగుతున్న పరిశోధనలు ఆసక్తికరమైన విషయాలు తెలుపుతున్నాయి. గుడ్లగూబ కళ్లను తదేకంగా చూడటం వల్ల అద్భుతమైన ఫలితాలున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. గుడ్లగూబ కళ్లను నిశితంగా చూడటం వల్ల.. మిగతవారికంటే ఎక్కువగా, లోతుగా, కచ్చితత్వంతో ఆలోచిస్తామని అంటున్నారు. మేధోపరంగా చక్కని ఫలితాలు ఉంటాయంటున్నారు. హిందూ శాస్త్రాలు కూడా గుడ్లగూబ శుభ సూచకమని చెబుతున్నాయి. రాత్రి నాల్గవ జాములో గుడ్లగూబ ఎవరింటిపై వాలినా ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని, పనిమీద బయటకు వెళ్లేటప్పుడు గుడ్లగూబ ఎడమవైపు కనిపిస్తే కార్యం సిద్ధిస్తుందన్న నమ్మకాలు ఉన్నాయి