ఇంటి పట్టాలు పంపిణీ కార్యక్రమం పై కమిషనర్ సమీక్ష
నగరపాలక సంస్థ కమిషనర్ గిరీష
తిరుపతి: నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణంలో వైయస్సార్ సమావేశ మందిరం నందు ఇంటి పట్టాల కార్యక్రమంపై కమిషనర్ గిరీష సోమవారం రాత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు.తిరుపతి నగరంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఆదేశాల మేరకు జూలై 8న వైఎస్ రాజశేఖరరెడ్డి గారు జయంతి సందర్భంగా ఇంటి పట్టాల పంపిణీ ఏర్పాటుపై హౌసింగ్ అర్బన్ ఎమ్మార్వో, ఏపీ టెడ్ కో(APTIDCO) అధికారులతో సమీక్ష నిర్వహించి ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు జూలై 8 వ తేదీ ఇంటి పట్టాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.అర్హులైన ప్రతి ఒక్కరికి మహిళా పేరుమీద ఇంటి పట్టాల పంపిణీ చేయాలనే ప్రభుత్వం నిర్ణయించిందని, ప్రత్యేక శ్రద్ధతో తీసుకొని అర్హత గల లబ్ధిదారులకు ఇంటి పట్టాలు అందేలా పనిచేయాలన్నారు, దీని ప్రకారం హౌసింగ్ సిబ్బంది జాబితా సిద్ధం చేయాలని కమిషనర్ వారు ఆదేశించారు.ఈ సమీక్ష సమావేశంలో కమిషనర్ వారితో పాటు అదనపు కమిషనర్ హరిత, ఉప కమిషనర్ చంద్రమౌళీశ్వర రెడ్డి, అర్బన్ ఎమ్మార్వో వెంకటరమణ, నగరపాలక సంస్థ ఏపీ టెట్‌కు హౌసింగ్ అధికారులు కాటంరాజు, లు