ఉద్యోగాల పేరుతో లక్షలు కాజేసిన మాయలేడి.
చిత్తూరు జిల్లా:చంద్రగిరి పోలీసులు, మోసపూరిత ఓమాయలేడిని అదుపులోకి తీసుకొన్నారు.పోలీసుల వివరాల మేరకు విదేశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగుల దగ్గర లక్షలు దండుకున్న మాయలేడిని చంద్రగిరి సర్కిల్ ఇన్సెపెక్టర్ రామచంద్రా రెడ్డి విజయవాడలో గురువారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అక్కడ నుంచి చంద్రగిరికి తీసుకొచ్చి, కడప సెంట్రల్ జైల్ కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తిరుపతికి చెందిన సంధ్య, నిరుద్యోగులను టార్గెట్ చేసుకుని విదేశాలలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి నాయుడుపేటకు చెందిన పవన్ కుమార్ వద్ద నుంచి ₹.14 లక్షలు తీసుకుంది. కొద్దిరోజులకు మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు చంద్రగిరి పియస్ లో ఫిర్యాదు వచ్చినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, యస్పీ రమేష్ రెడ్డి ఆదేశాల మేరకు డియస్పి నరసప్ప పర్యవేక్షణలో సిఐ రామచంద్రా రెడ్డి తన బృందంతో కలసి గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. నిందితురాలు విజయవాడలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు చాకచక్యంగా గురువారం ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. నిందితురాలు సంధ్య పై గుంటూరులో రెండు ఛీటింగ్ కేసుల