ఫేస్‌‌బుక్‌లో ఓ మహిళను వేధించిన గ్రామ వాలంటీర్

తూర్పుగోదావరి జిల్లా:అనపర్తి మండలం కప్పవరం గ్రామంలో చోటుచేసుకుంది. ఫేక్ పేస్ బుక్ అకౌంట్ క్రియేట్ చేసి, తన ఫోటోలు అందులో పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారని ఓ గృహిణి పోలీసులకు పిర్యాదు చేసింది. నెల రోజులైనా ఫోటోల తొలగించక పోవడంతో బాధితురాలు మరోసారి కుటుంబ సభ్యులతో ధర్నాకు దిగింది.తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కుతుకులూరు చెందిన ఓ మహిళ.. భర్త వ్యాపార నిమిత్తం ఇతరప్రాంతాలకు వెళ్లడంతో తల్లిదండ్రుల గ్రామమైన కొప్పవరం గ్రామంలో నివాసం ఉంటుంది. ఇంటి యజమాని కొడుకు, గ్రామవాలెంటీర్ అయిన దుర్గారెడ్డి అక్కా అని పిలుస్తూ ఆమెతో చనువుగా ఉండేవాడు. ఈ క్రమంలో ఆమె పేరుతో పేక్ ఫేస్ బుక్ ఐడి క్రియేట్ చేసి, కుటుంబ సభ్యుల ఫోటోలు పెట్టి లొంగదీసుకునే ప్రయత్నం చేశారు. అందుకు ఆమె అంగీకరించకపోవడంతో మరింత వేధించ సాగాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించగా.. ఫోటోలు డిలీట్ చేస్తానని చెప్పడంతో పోలీసులు అతన్ని విడిచిపెట్టారు.నెలరోజులైనా ఫేస్ బుక్ లో ఫోటోలు తొలగించక పోవడంతో దుర్గారెడ్డిని మహిళ నిలదీసింది. ఈఘటనతో తన భర్త పిల్లలతతో సహా తనను ఇంటి నుంచి పంపించాడని ఆవేదన వ్యక్తం చేస్తోంది. కుటుంబ సభ్యులతో కలిసి దుర్గారెడ్డి ఇంటివద్ద ధర్నాకు దిగింది. పోలీసులు, గ్రామ పెద్దలు సైతం తమకు న్యాయం చేయడంలేదని ఆమె ఆవేదన వ్యక్తంచేస్తోంది.

About The Author